తిమ్మాపూర్, వెలుగు: ఉద్యోగులు కొట్లాడే నైజాన్ని కోల్పోతున్నారని, హక్కుల కోసం పోరాడాల్సిందేనని టీఎన్జీవోల రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇరిగేషన్ శాఖ ఫోరం సర్వసభ్య సమావేశం ఎల్‌ఎండీలోని వేంకటేశ్వర ఆలయ ఆవరణలో జరిగింది. ఈ సమావేశానికి మారం జగదీశ్వర్, జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కార్యదర్శి, ఇరిగేషన్ శాఖ రాష్ట్ర కన్వీనర్ సంఘం లక్ష్మణ్‌రావు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యమాల గడ్డ కరీంనగర్ అని, ఉద్యోగ సంఘాల పనితీరు గతానికి నేటికీ పూర్తి తేడా ఉందన్నారు. సంఘాన్ని బలోపేతం చేయాలంటూ పిలుపునిచ్చిన ఆయన ఇందుకోసం సభ్యత్వాలు చేయించడం తప్పనిసరి పేర్కొన్నారు. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, ఎన్నికలు ఏవి జరిగినా ఏకగ్రీవమేనని గుర్తు చేశారు. టీఎన్జీవో సంఘం అంటేనే సంక్షేమ సంఘమన్నారు. అనంతరం ఇరిగేషన్ ఫోరం కార్యవర్గం ఎన్నిక జరిగింది.
జిల్లా అధ్యక్షునిగా జి.రమేశ్, కార్యదర్శిగా వి.ప్రసాద్, అసోసియేట్ ప్రెసిడెంట్‌గా ధనలక్ష్మి, ట్రెజరర్‌గా ఎండీ అస్కర్ అలీ ఎన్నికయ్యారు. సమావేశంలో ఎన్టీపీఏ రాష్ట్ర అధ్యక్షుడు కె.వెంకటేశ్వర రావు, ప్రధాన కార్యదర్శి రామచంద్రా రెడ్డి, టీజీవో జిల్లా అధ్యక్షుడు కాళీ చరణ్, జిల్లాల ప్రతినిధులు పాల్గొన్నారు.
