
ప్రముఖ బాలీవుడ్ నటి, ఒకప్పటి మిస్ యూనివర్స్ లారా దత్తా, ఆమె భర్త, టెన్నిస్ స్టార్ మహేశ్ భూపతికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మహేశ్ 48వ బర్త్ డే సందర్భంగా లారా... పలు ఫొటోలను ఇన్ స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు. దీనితో పాటు తనకెంతో ఇష్టమైన వ్యక్తికి... హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ భర్తతో కలిసి ఉన్న ఓ పిక్ ను షేర్ చేశారు లారా. అప్పట్లో వారిద్దరి లవ్ స్టోరీపై పలు పోస్టులు హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. కాగా 2011లో వీరి వివాహం జరిగింది.