
అమరావతి: ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 9,927 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలిపింది వైద్యారోగ్యశాఖ. అలాగే వైరస్ తో గడిచిన 24 గంటల్లో 92 మంది చనిపోయినట్లు వెల్లడించింది. తాజా కేసులతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 3,71,639కి చేరుకుందని..ఇందులో 89,932 మంది కరనా పేషెంట్లు ట్రీట్ మెంట్ తీసుకుంటున్నట్లు తెలిపింది. అలాగే ఇప్పటివరకు 2,78,247 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా.. మహమ్మారితో మొత్తం ఇప్పటివరకు 3,460 మంది చనిపోయారని తెలిపింది ఏపీ వైద్యారోగ్యశాఖ.