
అమరావతి: ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. గడచిన 24 గంటల్లో కొత్తగా 7,228 మంది కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కాగా, 45 మంది మరణించారని తెలిపింది రాష్ట్రవైద్యారోగ్యశాఖ. దీంతో మొత్తం రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 6,46,530కు చేరిందని చెప్పింది. ప్రస్తుతం 70,357 యాక్టివ్ కేసులున్నాయని.. ఇప్పటి వరకు 5,70,667 మంది కోలుకున్నారంది. కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 5,506కు చేరగా.. 24 గంటల్లో 8,291 మంది కొవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారని తెలిపింది. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 53,02,367 శాంపిల్స్ పరీక్షించారని తెలిపింది ఏపీ వైద్యారోగ్యశాఖ.