నేడు ఇండియా x ఇంగ్లండ్ రెండో టీ20

 నేడు ఇండియా x ఇంగ్లండ్ రెండో టీ20
  • కోహ్లీసేనపై ఒత్తిడి.. 
  • జోష్ మీదున్న ఇంగ్లిష్ టీమ్
  • రా. 7 నుంచి స్టార్ స్పోర్ట్స్‌లో


అహ్మదాబాద్: ఫేవరెట్స్గా బరిలోకి దిగి తొలి టీ20లో ఇంగ్లండ్ చేతిలో చిత్తుగా ఓడిపోయిన టీమిండియా తన తప్పులను సరిదిద్దుకోవడంపై దృష్టి పెట్టింది. బ్యాటింగ్ పెర్ఫామెన్స్ను ఇంప్రూవ్ చేసుకొని ఇంగ్లిష్ టీమ్ను దెబ్బకు దెబ్బ తీయాలని పట్టుదలగా ఉంది. దాంతో,  ఐదు మ్యాచ్ల సిరీస్లో ఆదివారం జరిగే రెండో టీ20లో కోహ్లీసేన గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. దాదాపు మూడు నెలల విరామం తర్వాత వైట్బాల్ ఫార్మాట్లో బరిలోకి దిగిన కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, యుజ్వేంద్ర చహల్తో పాటు శిఖర్ ధవన్, కెప్టెన్ విరాట్ కోహ్లీ  ఆకట్టుకోకపోవడంతో తొలి పోరులో ఆతిథ్య జట్టు పూర్తి గా తేలిపోయింది. అయితే, ఒక్క ఓటమితో మన జట్టు పనైపోయిందని అనలేం. కానీ, 0–2తో వెనుకబడితే మాత్రం ఒత్తిడి మరింత పెరుగుతుంది.  కాబట్టి మనోళ్లు తక్షణమే పుంజుకోవాల్సి ఉంటుంది. అందువల్ల కోహ్లీసేన దెబ్బతిన్న పులిలా ఇంగ్లండ్ టీమ్పై పంజా విసరాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. అయితే, తొలి పోరులో ఓటమికి బదులు తీర్చుకోవాలన్నా.. సిరీస్ 1–1తో సమం చేయాలన్నా  కోహ్లీ అండ్ కో అన్ని డిపార్ట్మెంట్స్లోనూ మెరుగ్గా ఆడాల్సిందే. ముఖ్యంగా బ్యాటింగ్లో మరింత జాగ్రత్త పడాల్సి ఉంటుంది. అనవసర షాట్లకు పోయి వికెట్లు పారేసుకున్న ఓపెనర్లు శిఖర్ ధవన్, లోకేశ్ రాహుల్తో పాటు కెప్టెన్ విరాట్ బాధ్యతగా ఆడాల్సిన అవసరం ఉంది. తర్వాతి మ్యాచ్ నుంచి రెగ్యులర్ ఓపెనర్ రోహిత్ శర్మకు దారి వదలాల్సిన నేపథ్యంలో ధవన్, రాహుల్ తమ బ్యాట్కు పని చెప్పాల్సిందే. ఈ ఇద్దరూ మంచి ఆరంభం ఇస్తే వన్డౌన్లో వచ్చే కోహ్లీ నుంచి దూకుడైన ఇన్నింగ్స్ ఆశించొచ్చు. నాలుగో టెస్టుతో పాటు తొలి ఇన్నింగ్స్లో డకౌటై విమర్శలు ఎదుర్కొంటున్న విరాట్ టీమ్ను ముందుండి నడిపించాల్సిన బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. తొలి మ్యాచ్లో టీమ్ ను ఆదుకున్న శ్రేయస్ అయ్యర్ అదే జోరు కొనసాగిస్తే  టీమ్లో తన ప్లేస్ను పదిలం చేసుకుంటాడు. ఇక, జట్టుకు కీలక ఆటగాళ్లుగా భావిస్తున్న రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా నుంచి మేనేజ్మెంట్ మరింత బెటర్ పెర్ఫామెన్స్ ఆశిస్తోంది. మంచి ఆరంభం వస్తే ఇద్దరూ దూకుడుగా ఆడి భారీ స్కోర్లు అందించాలని కెప్టెన్ కోహ్లీ కోరుకుంటున్నాడు. రివర్స్ స్కూప్, ర్యాంప్ షాట్స్ వంటి సాహసోపేత షాట్స్ మాత్రమే కాకుండా శ్రేయస్ మాదిరిగా  ఈ ఇద్దరూ గ్రౌండ్ షాట్స్ ఆడితే మంచిది.  తొలి మ్యాచ్లో ఇద్దరికీ మంచి ఆరంభాలు దక్కినప్పటికీ వాటిని భారీ స్కోర్లుగా మలచలేకపోయారు. జోఫ్రా ఆర్చర్, మార్క్ వుడ్ ఎక్స్ట్రా బౌన్స్తో వేసిన ఫాస్ట్, స్ట్రెయిట్ బాల్స్కు షాట్లు ఆడలేకపోయారు. మరి, సెకండ్ మ్యాచ్లోనూ పిచ్ అలానే స్పందిస్తే  ఇంగ్లండ్ పేసర్లకు హోమ్టీమ్ బ్యాట్స్మెన్ ఎలా కౌంటర్ ఇస్తారో చూడాలి. 
తుది జట్టులో మార్పులు
ఈ మ్యాచ్ కోసం తుది జట్టులో కెప్టెన్ విరాట్ కోహ్లీ కొన్ని మార్పులు చేసే అవకాశం ఉంది. ఫస్ట్ టీ20లో రోహిత్ లేని లోటు కనిపించింది. అతనికి రెండు మ్యాచ్ల్లో రెస్ట్ ఇచ్చామని విరాట్ చెప్పాడు. కానీ, ధవన్ తీవ్రంగా  నిరాశ పరచడంతో ఈ మ్యాచ్లోనే హిట్మ్యాన్ను బరిలోకి దింపే ఆలోచన చేస్తాడేమో చూడాలి. నాలుగో నంబర్లో అయ్యర్ అద్భుతంగా ఆడడంతో  సూర్య కుమార్ ఈసారి కూడా బెంచ్కే పరిమితం కావాల్సి ఉంటుంది.  ఇక, స్కోరు మరీ చిన్నది కావడంతో తొలి పోరులో బౌలర్లకు పోరాడే అవకాశం లేకుండా పోయింది. అయితే, ముగ్గురు స్పిన్నర్ల  ప్లాన్పై విమర్శలు రావడంతో  వారిలో ఒకరిని తప్పించి పేసర్ నవదీప్ సైనీని టీమ్లోకి తీసుకునే చాన్స్ ఉంది. అలాగే  లెగ్ స్పిన్ ఆల్రౌండర్ రాహుల్ తెవాటియాను తీసుకునే ఆలోచన మేనేజ్మెంట్ చేయొచ్చు. అతని పవర్హిట్టింగ్తో బ్యాటింగ్ బలం మరింత పెరుగుతుంది. మరోవైపు ఫస్ట్ మ్యాచ్ జోష్ను కొనసాగించాలని ఇంగ్లండ్ టీమ్ ఆశిస్తోంది. ఏదైనా సమస్య ఎదురైతే తప్ప కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ తమ ఫైనల్ ఎలెవన్ను మార్చే అవకాశం కనిపించడం లేదు.