ఇవాళ ఢిల్లీతో పంజాబ్ ఢీ

ఇవాళ ఢిల్లీతో పంజాబ్ ఢీ

పంజాబ్‌కు ఢిల్లీ సవాల్‌

ప్లేఆఫ్‌‌ బెర్తుపై క్యాపిటల్స్‌‌ కన్ను

దుబాయ్‌‌: రెండు సూపర్‌‌ ఓవర్లకు దారి తీసిన మ్యాచ్‌‌లో ముంబైపై ఉత్కంఠ విజయం సాధించిన కింగ్స్‌‌ ఎలెవన్‌‌ పంజాబ్‌‌  మరో సవాల్‌‌కు రెడీ అయింది. వరుసగా రెండు విక్టరీలతో  ప్లే ఆఫ్‌‌ అవకాశాలు సజీవంగా ఉంచుకోవడంతో పాటు కాన్ఫి డెన్స్‌‌ పెంచుకున్న  రాహుల్‌‌సేన మంగళవారం జరిగే మ్యాచ్‌‌లో టేబుల్‌‌ టాపర్‌‌ ఢిల్లీ క్యాపిటల్స్‌‌ను ఢీకొట్టనుంది. ప్లే ఆఫ్‌‌ రేసులో నిలవాలంటే ప్రతీ మ్యాచ్‌‌ నెగ్గాల్సిన పరిస్థితి ఉండడంతో  ఢిల్లీపై గెలిస్తే  ఆ జట్టు ఆత్మవిశ్వాసం మరింత పెరగనుంది. అది జరగాలంటే పంజాబ్‌‌ మెరుగైన పెర్ఫామెన్స్‌‌ చేయాల్సి ఉంది. ముఖ్యంగా మ్యాచ్‌‌లను ముగించే విషయంలో ఆ జట్టు పక్కాప్లాన్‌‌ రెడీ చేసుకోవాలి. ఎందుకంటే గత రెండు మ్యాచ్‌‌ల్లోనూ ఆ జట్టు ఈజీగా గెలవాల్సింది. ఆర్‌‌సీబీతో మ్యాచ్‌‌ను ఫైనల్‌‌ బాల్‌‌ వరకూ తీసుకెళ్లిన పంజాబ్‌‌… ఆదివారం ముంబైపై రెండు సూపర్‌‌ ఓవర్లు ఆడాల్సిన పరిస్థితి తెచ్చుకుంది. టాపార్డర్‌‌ అద్భుతంగా రాణిస్తున్నా మిడిలార్డర్‌‌ నుంచి సరైన సపోర్ట్‌‌ లేకపోవడం వల్లే ఈ పరిస్థితి ఎదురవుతోంది. లోకేశ్‌‌, మయాంక్‌‌ తో పాటు లేటుగా అవకాశం వచ్చినా తనదైన స్టయిల్లో దుమ్మురేపుతున్న గేల్‌‌ ఫామ్‌‌లో ఉండడం కింగ్స్‌‌కు ప్లస్‌‌ పాయింట్‌‌. కానీ, మిడిలార్డర్‌‌లో స్టార్‌‌ ప్లేయర్‌‌ మ్యాక్స్‌‌వెల్‌‌ పేలవ ఫామ్‌‌ జట్టును దెబ్బతీస్తోంది. అలాగే, షమీ తప్ప డెత్‌‌ ఓవర్లలో సత్తా చాటే బౌలర్‌‌ లేకపోవడం కూడా సమస్యగా మారింది. ఈ సవాళ్లను అధిగమిస్తేనే పటిష్ట ఢిల్లీకి పంజాబ్‌‌ చెక్‌‌ పెట్టగలదు. మరోవైపు 9 మ్యాచ్‌‌ల్లో ఏడు విక్టరీలతో క్యాపిటల్స్‌‌ జోరు మీదుంది. లాస్ట్‌‌ మ్యాచ్‌‌లో చెన్నైపై విజయంతో ప్లేఆఫ్‌‌కు చేరువైన ఆ జట్టు పంజాబ్‌‌ను ఓడించి బెర్తు కన్ఫామ్ చేసుకోవాలని చూస్తోంది. ఓపెనర్‌‌ పృథ్వీ షా ఫామ్‌‌ కోల్పోయినా ధవన్‌‌ జోరందుకోవడం ప్లస్‌‌ పాయింట్‌‌. బౌలింగ్‌‌లోనూ  ఆ టీమ్‌‌కు ఎలాంటి సమస్యల్లేవు. పంజాబ్‌‌పైనే సూపర్‌‌ ఓవర్లో గెలిచి లీగ్‌‌ను స్టార్ట్‌‌ చేసిన  క్యాపిటల్స్‌‌.. ఆ జట్టును మరోసారి ఓడిస్తుందో లేదో చూడాలి.