టార్గెట్‌‌‌‌ సిరీస్‌‌‌‌

టార్గెట్‌‌‌‌ సిరీస్‌‌‌‌
  • రాహుల్‌‌‌‌ బ్యాటింగ్‌‌‌‌ ప్లేస్‌‌‌‌పై ఫోకస్‌‌‌‌
  • కోహ్లీ ఫామ్‌‌‌‌పై ఆందోళన
  • మ. 1.30 నుంచి స్టార్‌‌‌‌ స్పోర్ట్స్‌‌‌‌లో

అహ్మదాబాద్‌‌‌‌: ఫస్ట్‌‌‌‌ వన్డేలో సూపర్‌‌‌‌ హిట్‌‌‌‌ అయిన టీమిండియా.. వెస్టిండీస్‌‌‌‌తో సెకండ్‌‌‌‌ వన్డేకు రెడీ అయ్యింది. బుధవారం జరిగే ఈ మ్యాచ్‌‌‌‌లో గెలిచి సిరీస్‌‌‌‌ను సొంతం చేసుకోవాలని టార్గెట్‌‌‌‌గా పెట్టుకుంది. మూడు మ్యాచ్‌‌‌‌ల సిరీస్‌‌‌‌లో ప్రస్తుతం ఇండియా 1–0 లీడ్‌‌‌‌లో ఉంది. ఇక పర్సనల్‌‌‌‌ రీజన్స్‌‌‌‌తో తొలి వన్డేకు దూరంగా ఉన్న వైస్‌‌‌‌ కెప్టెన్‌‌‌‌ కేఎల్‌‌‌‌ రాహుల్‌‌‌‌ను ఏ ప్లేస్‌‌‌‌లో ఆడించాలన్న దానిపై సందిగ్ధత కొనసాగుతున్నది. రాహుల్‌‌‌‌ను ఓపెనర్‌‌‌‌గా కొనసాగించాలనుకుంటే.. ఇషాన్‌‌‌‌ కిషన్‌‌‌‌కు చాన్స్‌‌‌‌ కష్టమే. అయితే ఫస్ట్‌‌‌‌ వన్డేలో స్లో ట్రాక్‌‌‌‌పై ఇషాన్‌‌‌‌ రాణించాడు. ఒకవేళ రాహుల్‌‌‌‌ను మిడిలార్డర్‌‌‌‌కు పంపిస్తే దీపక్‌‌‌‌ హుడా బెంచ్‌‌‌‌కు పరిమితం కానున్నాడు. కోహ్లీ, రిషబ్‌‌‌‌ పంత్‌‌‌‌, సూర్యకుమార్‌‌‌‌తో బలంగా ఉన్న మిడిలార్డర్​లో ఎక్స్‌‌‌‌ట్రా బ్యాటర్​గా హుడాను కొనసాగించడం అసాధ్యం. ఈ రెండింటిలో రోహిత్‌‌‌‌ దేనికి మొగ్గు చూపుతాడో చూడాలి. ఇక కొవిడ్‌‌‌‌ నుంచి కోలుకున్న శిఖర్‌‌‌‌ ధవన్‌‌‌‌, శ్రేయస్‌‌‌‌ అయ్యర్‌‌‌‌.. మంగళవారం లైట్‌‌‌‌ ట్రెయినింగ్‌‌‌‌లో పాల్గొన్నారు. అయితే ఈ మ్యాచ్‌‌‌‌కు ఈ ఇద్దరు అందుబాటులో ఉండే చాన్స్​ లేదు. రుతురాజ్‌‌‌‌ ఇంకా ఐసోలేషన్‌‌‌‌లోనే ఉన్నాడు. 
 

కోహ్లీ ఏం చేస్తాడో..? 
ఫస్ట్‌‌‌‌ వన్డేలో ఫెయిలైన మాజీ కెప్టెన్‌‌‌‌ విరాట్‌‌‌‌కు ఈ మ్యాచ్‌‌‌‌ అత్యంత కీలకం. ఇందులో రన్స్‌‌‌‌ చేయకపోతే తనపై విమర్శలు పెరుగుతాయి. దీనికితోడు గత రెండేళ్ల నుంచి విరాట్‌‌‌‌ ఒక్క సెంచరీ కూడా చేయలేదు. మళ్లీ స్లో ట్రాక్‌‌‌‌పైనే మ్యాచ్‌‌‌‌ కావడంతో కోహ్లీ ఏం చేస్తాడన్న ఆసక్తి, ఉత్కంఠ మొదలైంది. 
మరోవైపు కెప్టెన్‌‌‌‌గా, బ్యాటర్‌‌‌‌గా రోహిత్‌‌‌‌ డ్యూయల్‌‌‌‌ రోల్‌‌‌‌ సూపర్‌‌‌‌ సక్సెస్‌‌‌‌ అయ్యింది. సూర్యకుమార్‌‌‌‌తో ఇబ్బంది లేకపోయినా, పంత్‌‌‌‌ బ్యాట్ ఝుళిపించాల్సిన టైమ్‌‌‌‌ వచ్చేసింది. ఇక బౌలింగ్‌‌‌‌లో మార్పులు చేసేందుకు మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌ రెడీగా లేదు. సూపర్‌‌‌‌ ఫామ్‌‌‌‌లో ఉన్న స్పిన్నర్లు చహల్‌‌‌‌, సుందర్‌‌‌‌లలో ఎవర్ని తప్పించే చాన్స్‌‌‌‌ లేదు. అయితే రిస్ట్‌‌‌‌ స్పిన్నర్‌‌‌‌ కుల్దీప్‌‌‌‌ చాన్స్‌‌‌‌ కోసం వెయిట్‌‌‌‌ చేస్తున్నాడు. ఒకవేళ సిరీస్‌‌‌‌ గెలిస్తే.. థర్డ్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌లో అతనికి అవకాశం ఇవ్వొచ్చు. పేసర్లుగా సిరాజ్‌‌‌‌, ప్రసిధ్‌‌‌‌ కృష్ణ, శార్దూల్‌‌‌‌ ఠాకూర్‌‌‌‌ కంటిన్యూ కానున్నారు. ఈసారి కూడా స్పిన్నర్లు ప్రభావం చూపే చాన్సుంది. 
 

50 ఓవర్లు ఆడతారా? 
మరోవైపు పేపర్‌‌‌‌ మీద బలంగా కనిపిస్తున్న విండీస్‌‌‌‌ టీమ్‌‌‌‌.. ఫీల్డ్‌‌‌‌లో ఘోరంగా తేలిపోతున్నది. గత 16 వన్డేల్లో పదిసార్లు 50 ఓవర్లను పూర్తిగా ఆడలేకపోయిన కరీబియన్లు.. ఈ మ్యాచ్‌‌‌‌లోనైనా ఆ కోటాను కంప్లీట్‌‌‌‌ చేస్తారా? చూడాలి. ఈ మ్యాచ్‌‌‌‌ కోసం టీమ్‌‌‌‌లో మార్పులు చూసే సూచన లేదు. అయితే టాప్‌‌‌‌ ఆర్డర్‌‌‌‌ ఫెయిల్యూర్‌‌‌‌ను ఎలా పరిష్కరిస్తారన్న దానిపై చర్చ జరుగుతున్నది. ఓపెనర్లలో హోప్‌‌‌‌, బ్రెండన్‌‌‌‌ కింగ్‌‌‌‌తో పాటు డారెన్‌‌‌‌ బ్రావో , బ్రూక్స్‌‌‌‌ వైఫల్యం..  జట్టు లో స్కోరుకు ప్రధాన కారణమవుతున్నది. ఇక ఐపీఎల్‌‌‌‌లో సూపర్‌‌‌‌ హిట్‌‌‌‌ అయ్యే పొలార్డ్‌‌‌‌.. బ్యాటర్‌‌‌‌గా, కెప్టెన్‌‌‌‌గా విఫలమవుతున్నాడు. ఈ మ్యాచ్‌‌‌‌లో నెగ్గాలంటే పొలార్డ్‌‌‌‌, పూరన్‌‌‌‌లోని హిట్టర్స్‌‌‌‌ బయటికి రావాల్సి ఉంటుంది. అయితే ఆల్‌‌‌‌రౌండర్‌‌‌‌గా జేసన్‌‌‌‌ హోల్డర్‌‌‌‌ ఫామ్‌‌‌‌లో ఉండటం విండీస్‌‌‌‌కు కలిసొచ్చే అంశం. బౌలింగ్‌‌‌‌లో అల్జారీ జోసెఫ్‌‌‌‌, కీమర్‌‌‌‌ రోచ్‌‌‌‌ సరైన ప్లేస్‌‌‌‌లో బాల్స్‌‌‌‌ వేయాల్సిన అవసరం చాలా ఉంది. లేదంటే రోహిత్‌‌‌‌ నుంచి ముప్పు తప్పదు. అకీల్‌‌‌‌ హొస్సేన్‌‌‌‌, ఫాబియెన్‌‌‌‌ అలెన్‌‌‌‌ అండగా నిలిస్తేనే ఈ మ్యాచ్‌‌‌‌లో విండీస్‌‌‌‌ విక్టరీని ఆశించొచ్చు.