
మంచు విష్ణు(Manchu Vishnu) ప్రధాన పాత్రలో వస్తున్న లేటెస్ట్ మూవీ కన్నప్ప(Kannappa). మహా శివ భక్తుడైన కన్నప్ప కథ ఆధారంగా వస్తున్న ఈ సినిమాను బాలీవుడ్ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తున్నాడు. పాన్ ఇండియా లెవల్లో వస్తున్న ఈ సినిమా కోసం మేకర్స్ రూ.100 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్స్ ప్రేక్షకుల్లో అంచనాలు పెంచుతున్నాయి. అందుకే ఈ సినిమా కోసం ఆడియన్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. షూటింగ్ కూడా దాదాపు కంప్లీట్ అవడంతో ప్రమోషన్స్ మొదలుపెట్టారు కన్నప్ప టీమ్.
ఇందులో భాగంగానే తాజాగా ప్రతిష్టాత్మకమైన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో మెరిశారు కన్నప్ప టీమ్. ప్రస్తుతం కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్-2024 జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా నిన్న జరిగిన హారిజన్: యాన్ అమెరికన్ సాగా స్క్రీనింగ్ లో పాల్గొన్నారు కన్నప్ప టీమ్. ఇదే విషయాన్ని మంచు విష్ణు ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. ఇదే స్టేజిపై కన్నప్ప టీజర్ కూడా విడుదల చేయనున్నారు అనే వార్తలు కూడా వైరల్ అవుతున్నాయి. మరి ఆ వార్తల్లో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.
Walked the Red Carpet yesterday for the screening of 'Horizon: An American Saga'@themohanbabu @pddancing @vinimanchu#cannes2024 pic.twitter.com/UcC8OPvFh1
— Vishnu Manchu (@iVishnuManchu) May 20, 2024
ఇక కన్నప్ప మూవీ విషయానికి.. ఈ సినిమాలో భక్త కన్నప్పగా మంచు విష్ణు కనిపిస్తుండగా.. ప్రభాస్ మహా శివుడిగా చేస్తున్నారని సమాచారం. ఇంకా ఈ సినిమాలో.. బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్, మలయాళ స్టార్ మోహన్ లాల్, కన్నడ స్టార్ శివ రాజ్ కుమార్, తమిళ స్టార్ నయనతార, లేటెస్ట్ గా కాజల్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇంత పెద్ద స్టార్ కాస్ట్ తో భారీగా వస్తున్న ఈ సినిమా ఏ రేంజ్ విజయాన్ని అందుకోనుందో చూడాలి.