ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్​కు సీపీఎం మద్దతు : మల్లు లక్ష్మి

ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్​కు సీపీఎం మద్దతు : మల్లు లక్ష్మి

సూర్యాపేట, వెలుగు: నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు మద్దతు ప్రకటిస్తున్నామని  సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు మల్లు లక్ష్మిఅన్నారు. సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్ లో జరిగిన  ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గం సమావేశంలో ఆమె మాట్లాడారు.  

పార్లమెంట్  ఎన్నికల్లో లౌకిక , ప్రజాస్వామ్యం కోసం ఇండియా కూటమి  భాగస్వామి అయిన కాంగ్రెస్ కు  మద్దతు ఇస్తున్నామన్నారు.     మతోన్మాద బీజేపీని ఓడించాలని సీపీఎం పిలుపు నిస్తుందని అన్నారు.  ఈ కార్యక్రమంలో ఆ పార్టీ  జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నెమ్మది వెంకటేశ్వర్లు,  జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి,  జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు  యాదగిరిరావు,  పాల్గొన్నారు.