ఒకే ఫ్యామిలీకి చెందిన 18 మంది మృతి..నసీరుద్దీన్ కుటుంబానికి పీసీసీ చీఫ్ పరామర్శ

ఒకే ఫ్యామిలీకి చెందిన 18 మంది మృతి..నసీరుద్దీన్ కుటుంబానికి  పీసీసీ చీఫ్  పరామర్శ

సౌదీ బస్సు ప్రమాదంలో మృతి చెందిన నసీరుద్దీన్ ఫ్యామిలీని టీ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ పరామర్శించారు. బాధిత ఫ్యామిలీని ఓదార్చిన ఆయన.. ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఇప్పటికే మంత్రి అజారుద్దీన్ నేతృత్వంలోని బృందాన్ని  సౌదీకి పంపామని చెప్పారు. కేంద్రంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు. సౌదీ ఎంబసీతో కూడా టచ్ లో ఉన్నామన్నారు మహేశ్ కుమార్ గౌడ్


 సౌదీ బస్సు ప్రమాదంలో హైదరాబాద్ విద్యానగర్ కు చెందిన నసీరుద్దీన్ ఓ రిటైర్డ్ ఉద్యోగి కుటుంబానికి చెందిన 18 మందితో ఉమ్రా యాత్రకు వెళ్లారు. నవంబర్ 17న జరిగిన బస్సు ప్రమాదంలో  నసీరుద్దీన్ సహా కుమార్తెలు, కోడళ్లు పిల్లలతో అందరూ చనిపోయారు. అయితే కుమారుడు సిరాజుద్దీన్ మాత్రం ఉద్యోగ రీత్యా యూఎస్ లో ఉంటున్నాడు. ఇపుడు ఫ్యామిలీలో అతనొక్కడే మిగిలాడని వారి బంధువులు వెల్లడించారు. 

►ALSO READ | సౌదీ బస్సు ప్రమాద మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.5 లక్షల ఎక్స్‏గ్రేషియా

సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. సోమవారం ( నవంబర్ 17 ) తెల్లవారుజామున ఉమ్రా యాత్రకు వెళ్లిన యాత్రికులతో ప్రయాణిస్తున్న బస్సు డీజిల్ ట్యాంకర్‎ను ఢీకొనడంతో 45 మంది సజీవ దహనమమయ్యారు. ఒక్కరే ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటనలో మృతులంతా హైదరాబాద్‎కు చెందినవారే. ప్రమాదం గురించి తెలుసుకున్న ప్రభుత్వం వెంటనే రాష్ట్ర సచివాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. సౌదీలోని ఇండియన్ ఎంబసీ అధికారులతో మాట్లాడింది.