Ravindra Jadeja: దూసుకెళ్తున్న జడేజా.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్‌లో తొలి ప్లేయర్‌గా చరిత్ర

Ravindra Jadeja: దూసుకెళ్తున్న జడేజా.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్‌లో తొలి ప్లేయర్‌గా చరిత్ర

టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా టెస్ట్ క్రికెట్ లో తిరుగులేకుండా పోతుంది. ఒక వైపు బ్యాటింగ్, మరోవైపు బౌలింగ్ లో నిలకడగా రాణిస్తున్న జడేజా అసలు సిసలు ఆల్ రౌండర్ గా నిలిచాడు. ప్రతి టెస్ట్ మ్యాచ్ కు ఏదో ఒక రికార్డ్ క్రియేట్ చేసే జడేజా.. సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో సరికొత్త చరిత్ర సృష్టించాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో 2000 పరుగులు.. 150 వికెట్లు తీసుకున్న తొలి ప్లేయర్ గా నిలిచాడు. సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్ రెండో ఇన్నింగ్స్ లో నాలుగు వికెట్లు తీయడంతో డబ్ల్యూటీసీలో 150 వికెట్లు పూర్తి చేసుకొని ఈ ఘనతను అందుకున్నాడు. 

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో 2000 కంటే ఎక్కువ పరుగులు.. 150 వికెట్లు తీసిన ఏకైక ప్లేయర్ గా నిలిచాడు. ఆగస్టు 2019లో WTC ప్రారంభమైనప్పటి నుండి కేవలం 16 మంది బౌలర్లు మాత్రమే 100 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు పడగొట్టారు. 100 కంటే ఎక్కువ వికెట్లు.. 1000 పరుగులు చేసిన ఆటగాళ్లలో పాట్ కమ్మిన్స్, అశ్విన్ మాత్రమే ఉన్నారు. అయితే డబ్ల్యూటీసీలో 2000 కంటే ఎక్కువ పరుగులు సాధించడంతో పాటు 150 వికెట్లు కూడా తన ఖాతాలో వేసుకొని ఆల్ రౌండర్ గా దూసుకెళ్తున్నాడు. ఇదే మ్యాచ్ లో జడేజా టెస్ట్ కెరీర్ లో 4000 పరుగులనుపూర్తి చేసుకోవడం విశేషం. 

►ALSO READ | WTC Points Table: నాలుగో స్థానానికి పడిపోయిన టీమిండియా.. WTC లేటెస్ట్ పాయింట్స్ టేబుల్‌ ఇదే!

సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో 11 పరుగుల వద్ద తన టెస్ట్ కెరీర్ లో 4000 పరుగుల మార్క్ పూర్తి చేసుకున్నాడు. బౌలింగ్ లో కూడా జడేజా 300 పైగా వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో జడేజా తొలి ఇన్నింగ్స్ లో 27 పరుగులు చేసి ఔటయ్యాడు. జడేజా టెస్ట్ కెరీర్ విషయానికి వస్తే 88 టెస్టుల్లో 119 ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేశాడు. 38.63 యావరేజ్ తో 4035 పరుగులు చేశాడు. వీటిలో 6 సెంచరీలు, 27 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. బౌలింగ్ విషయానికి వస్తే 163 ఇన్నింగ్స్ ల్లో 24 యావరేజ్ తో 342 వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుతం, జడేజా ఐసీసీ టెస్ట్ ఆల్ రౌండర్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్నాడు.

ఈ ఏడాది జడేజా అత్యుత్తమంగా రాణించాడు. 2025లో ఇప్పటివరకు తొమ్మిది టెస్టుల్లో 14 ఇన్నింగ్స్ లు ఆడిన ఈ టీమిండియా ఆల్ రౌండర్ 83.75 యావరేజ్ తో 688 పరుగులు చేశాడు. వీటిలో రెండు సెంచరీలు, ఐదు హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. 2022 నుంచి జడేజా టెస్ట్ ర్యాంకింగ్స్ లో తన అగ్ర స్థానాన్ని నిలుపుకుంటూ వస్తున్నాడు. మార్చి 9, 2022న జాసన్ హోల్డర్‌ను అధిగమించి టెస్టుల్లో టాప్ ఆల్ రౌండర్ గా నిలిచాడు. 36 ఏళ్ల జడేజా భారత టెస్ట్ జట్టుకు మూలస్తంభంగా మారాడు.