Gold Rate: సోమవారం దిగొచ్చిన గోల్డ్ అండ్ సిల్వర్.. ఏపీ తెలంగాణ తాజా రేట్లివే..

Gold Rate: సోమవారం దిగొచ్చిన గోల్డ్ అండ్ సిల్వర్.. ఏపీ తెలంగాణ తాజా రేట్లివే..

Gold Price Today: గతవారం పెరుగుతూ తగ్గుతూ కొనసాగిన బంగారం, వెండి ధరలు ఈ వారం ప్రారంభంలోనే శాంతించాయి. దీంతో పెళ్లిళ్ల సమయంలో షాపింగ్ చేయాలనుకుంటున్న తెలుగు రాష్ట్రాల ప్రజలు తమ షాపింగ్ షురూ చేసేస్తున్నారు. ప్రధానంగా అమెరికా షట్ డౌన్ సమస్య కొలిక్కి రావటంతో పాటు ఇతర దేశాలతో వాణిజ్య ఒప్పందాలు కొలిక్కి రావటం కూడా ఆందోళనలను తగ్గిస్తోందని నిపుణులు తగ్గింపు కారణాలుగా చెబుతున్నారు.

24 క్యారెట్ల బంగారం రేటు నిన్న అంటే నవంబర్ 16తో పోల్చితే 10 గ్రాములకు నవంబర్ 17న రూ.110 తగ్గింది. అంటే గ్రాముకు రేటు రూ.11 తగ్గుదలతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్య నగరాల్లో పెరిగిన రిటైల్ విక్రయ రేట్లు ఇలా ఉన్నాయి..

24 క్యారెట్ల గోల్డ్ గ్రాముకు రేటు(నవంబర్ 17న):

హైదరాదాబాదులో రూ.12వేల 497
కరీంనగర్ లో రూ.12వేల 497
ఖమ్మంలో రూ.12వేల 497
నిజామాబాద్ లో రూ.12వేల 497
విజయవాడలో రూ.12వేల 497
కడపలో రూ.12వేల 497
విశాఖలో రూ.12వేల 497
నెల్లూరు రూ.12వేల 497
తిరుపతిలో రూ.12వేల 497

ఇక 22 క్యారెట్ల గోల్డ్ రేటు నవంబర్ 16తో పోల్చితే ఇవాళ అంటే నవంబర్ 17న 10 గ్రాములకు రూ.100 పెరుగుదలను చూసింది. దీంతో సోమవారం రోజున ఏపీ, తెలంగాణలోని ప్రముఖ నగరాల్లో తగ్గిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. 

22 క్యారెట్ల గోల్డ్ గ్రాముకు రేటు(నవంబర్ 17న):

హైదరాదాబాదులో రూ.11వేల 455
కరీంనగర్ లో రూ.11వేల 455
ఖమ్మంలో రూ.11వేల 455
నిజామాబాద్ లో రూ.11వేల 455
విజయవాడలో రూ.11వేల 455
కడపలో రూ.11వేల 455
విశాఖలో రూ.11వేల 455
నెల్లూరు రూ.11వేల 455
తిరుపతిలో రూ.11వేల 455

బంగారం రేట్లతో పాటు మరోపక్క వెండి కూడా తమ రేట్ల తగ్గింపుల ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. నవంబర్ 17న కేజీకి వెండి నవంబర్ 16తో పోల్చితే రూ.2వేలు తగ్గటంతో తెలుగు రాష్ట్రాల్లో స్వచ్ఛమైన సిల్వర్ రేటు కేజీకి రూ.లక్ష 73వేలకు చేరుకుంది. అంటే గ్రాము వెండి రేటు రూ.173 వద్ద విక్రయాలు జరగుతున్నాయి.