తెలుగు సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు ఉత్కంఠభరితమైన, ఫ్రెష్ కాంబినేషన్ గురించి తెగ ఊహాగానాలు వినిపిస్తున్నారు. అదే మాస్ మహారాజా రవితేజ, స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు గురించి . వీరిద్దరి తొలిసారిగా వెండితెరపై కలిసి నటించనున్నారని ఇండస్ట్రీ వర్గా్ల్లో టాక్ వినిపిస్తోంది. త్వరలోనే ఇది సెట్ మీదకు వెళ్లనుంది సమాచారం. ఈ కాంబో నిజమైతే, టాలీవుడ్‌లో ఇది సరికొత్త రికార్డును సృష్టించడం ఖాయమని అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
పవర్‌ఫుల్ క్రైమ్ థ్రిల్లర్‌లో..
ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు 'నిన్ను కోరి', 'మజిలీ', 'ఖుషి' వంటి హృదయాన్ని తాకే చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వం వహించనున్నారని తెలుస్తోంది. శివ నిర్వాణ గతంలో ఎక్కువగా ఫ్యామిలీ, ఎమోషనల్ లవ్ స్టోరీలను తెరకెక్కించారు. అయతే ఈసారి మాత్రం తన మార్క్ శైలిని పక్కన పెట్టి.. ఓ పవర్‌ఫుల్ క్రైమ్ థ్రిల్లర్ కథను సిద్ధం చేశారని టాక్. దీనికి రవితేజ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. ఈ క్రైమ్ థ్రిల్లర్‌లో రవితేజకు జోడీగా సమంతను సంప్రదించారని,.. చర్చలు దాదాపు కొలిక్కి వచ్చాయని తెలుస్తోంది. ఈ నెలలోనే ఈ ప్రాజెక్ట్ లాంఛనంగా ప్రారంభం కావచ్చు అనే టాక్ కూడా గట్టిగా వినిపిస్తోంది. అయితే, మేకర్స్ నుండి ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
వరుస సినిమాలతో ఫుల్ బిజీ..
రవితేజ ఇటీవల 'మాస్ జాతర' చిత్రంతో ప్రేక్షకులను పలకరించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని సాధించలేకపోయింది. ప్రస్తుతం ఆయన 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' అనే ఫ్యామిలీ ఓరియెంటెడ్ చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. సంక్రాంతి కానుకగా ఈ చిత్రం విడుదల కానుంది. ఇటీవల సమంత ' మా ఇంటి బంగారం ' మూవీని మొదలు పెట్టింది. ఈ చిత్రానికి హీరోయిన్, నిర్మాత సమంత కాగా.. నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో సమంతను కొత్త కోణం చూపిస్తున్నారు. ఇక ఆమె నటించనున్న తదుపరి బాలీవుడ్ ప్రాజెక్ట్ 'రక్త బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్‌డమ్' (Rakt Brahmand: The Bloody Kingdom). రాజ్ నిడిమోరు, కృష్ణ డికె నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఆదిత్య రాయ్ కపూర్, అలీ ఫజల్ వంటి భారీ తారాగణం ఉంది.
ప్రైవేట్ లైఫ్ రూమర్స్..
'సిటాడెల్' ప్రాజెక్ట్ నుంచి రాజ్ నిడిమోరుతో కలిసి పనిచేసిన సమంత, ఇటీవల ఆయనతో హౌస్ హంటింగ్ చేస్తోందనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాజ్ 2022లో విడాకులు తీసుకున్నారు. వారిద్దరూ వృత్తిపరమైన భాగస్వామ్యం తర్వాత వ్యక్తిగతంగానూ దగ్గరై, కలిసి ఉండే ఆలోచనలో ఉన్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా, రవితేజ-సమంత కాంబోపై వస్తున్న ఈ వార్త టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ అంచనాలకు తెరదించుతూ అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో వేచి చూడాలి.
