ఆధ్యాత్మికం: మాఘ పౌర్ణమి ఎప్పుడు.. ఆరోజు నదీ స్నానం ఎందుకు చేయాలి..!

ఆధ్యాత్మికం: మాఘ పౌర్ణమి ఎప్పుడు.. ఆరోజు నదీ స్నానం ఎందుకు చేయాలి..!

హిందూ పురాణాల ప్రకారం  తెలుగు నెలల్లో ప్రతి నెలకు  చాలా ప్రత్యేకత ఉంది.  కార్తీకమాసం దీపారాధనకు .. పూజలకు ముఖ్యమైతే... మాఘమాసం...పవిత్ర స్నానాలకు ఎంతో ముఖ్యమని పండితులు చెబుతున్నారు.మాఘ మాసం పౌర్ణమి.. పరమేశ్వరునికి.. మహా విష్ణువునకు చాలా ఇష్టమని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు. ఈ ఏడాది మాఘ పౌర్ణమి ఎప్పుడు వచ్చింది.. ఆరోజు ఏం చేయాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .!

మాఘ పూర్ణిమ హిందువులందరికి చాలా పవిత్రమూన రోజు .   ఈ మాఘ పూర్ణిమ వేళ పవిత్ర నదిలో స్నానం ఆచరించి పరమేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేసిన తర్వాత దానధర్మాలు చేయాలని పండితులు చెబుతారు. అంతే కాకుండా ఈ మాఘ పూర్ణిమ రోజున పవిత్ర స్నానం ఆచరించడం వల్ల సకల పాపాల నుంచి విముక్తి పొందడమే కాకుండా జీవితంలో సానుకూల శక్తి కలుగుతుందని స్కంద పురాణం చెబుతోంది. 

మాఘ పూర్ణిమ ఎప్పుడు..

  • మాఘపౌర్ణమి తిథి ప్రారంభం :  ఫిబ్రవరి 1 ఆదివారం ఉదయం 5.53 గంటలకు
  • మాఘపౌర్ణమి తిథిముగింపు:   ఫిబ్రవరి 2 సోమవారం తెల్లవారుజామున 03.39 గంటలకు
  • పండితులు తెలిపిన వివరాల ప్రకారం  మాఘ పూర్ణిమ 2026 పండుగను ఫిబ్రవరి 1వ తేదీ ఆదివారం  రోజు జరుపుకుంటారు

మాఘ పూర్ణిమ రోజున దేవతలు  పవిత్ర నదుల్లో  స్నానం చేస్తారని పురాణాల ద్వారా తెలుస్తుంది.  ఇలాంటి పవిత్రమైన రోజు నదీ స్నానం .. దాన ధర్మాలు చేయడం వలన సకల పాపాల నుంచి విముక్తి కలుగుతుందని పండితులు చెబుతున్నారు.  ఈ మాఘ పౌర్ణమి రోజు సముద్ర స్నానం లేదా నదీ స్నానం చేయడం కుదరని వాళ్లు కనీసం తిలదానమైనా ఇవ్వాలని పండితులు అంటున్నారు.


గౌరీదేవికి ఎంతో ఇష్టమైన రోజు!

ఈ మాఘ పౌర్ణమి పార్వతీ దేవికి ఎంతో ఇష్టమైన రోజు. ఈరోజున భక్తి శ్రద్ధలతో పార్వతి దేవిని పూజిస్తే అడ్డంకులు, ప్రతికూల ఆలోచనలు తొలగిపోయి జీవితంలో సానుకూలత ఏర్పడుతుందని  ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు.  తమలపాకులో మంచి పసుపు ముద్దతో గౌరమ్మను చేసి.. గంధం, కుంకుమ బొట్లు పెట్టి ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి. తర్వాత అక్షితలతో గౌరమ్మను పూజించి.. గౌరీ దేవి మంత్రాలు, గౌరీ స్తోత్రాలు పఠించాలి. అమ్మవారికి బెల్లం నైవేద్యంగా సమర్పించాలి. ఇలా చేయడం వల్ల దాంపత్య సమస్యలు, కుటుంబ కలహాలు తొలగిపోతాయట. అలాగే గౌరీదేవిని స్మరించుకుంటూ గోరింటాకు దానం ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల గౌరీదేవి అనుగ్రహంతో పెళ్లికాని అమ్మాయిలకు తొందరగా పెళ్లి జరుగుతుందని చెబుతారు.

పవిత్ర నదులలో స్నానం చేయడం ఎందుకు చేయాలి…

మాఘమాసం పౌర్ణమి  రోజున పవిత్ర గంగా నదిలో స్నానం చేసి… దాతృత్వం చేయడం ద్వారా మోక్షం పొందుతారని అంటారు.  హిందూ విశ్వాసం ప్రకారం విష్ణువు ప్రధానంగా మాఘ పూర్ణిమ రోజున గంగా స్నానం చేయడం పట్ల అదృష్టం మరియు సంపద మరియు మోక్షాన్ని ఇస్తాడని పండితులు చెబుతున్నారు. 

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని  పురాణాల ప్రకారం పండితులు నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించలేదు. మీకున్న ఆధ్యాత్మిక నిపుణులను సంప్రదించటం ఉత్తమం.