సంగారెడ్డి జిల్లాలో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. రామచంద్రాపురం మండలం తెల్లాపూర్ పరిధిలోని మేళ చెరువులోకి నీళ్లు రాకుండా అడ్డుగా నిర్మించిన గోడలను హైడ్రా సిబ్బంది తొలగించారు. అనంతరం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఫెన్సింగ్ వేశారు. కాగా, మేళ చెరువులోకి నీళ్లు రాకుండా చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో కొందరు మట్టి పోశారని స్థానికులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.
ఈ మేరకు రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో అక్రమంగా మట్టి పోసినట్లు నిర్ధారించారు. వ్యవసాయ భూమిని ఆక్రమించినట్లు గుర్తించారు. చెరువులోకి నీళ్లు రాకుండా అడ్డుగా నిర్మించిన గోడలను హైడ్రా సిబ్బంది శుక్రవారం (జనవరి 30) తొలగించారు. అనంతరం చెరువు చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. చెరువులో మట్టిపోసిన వారిపై కేసులు పెట్టనున్నట్లు హైడ్రా అధికారులు తెలిపారు.
