Ameesha Patel: కుర్రాళ్లు డేటింగ్‌కు పిలుస్తున్నారు.. నచ్చితే పెళ్లికి రెడీ అంటున్న 50 ఏళ్ల బాలీవుడ్ బ్యూటీ!

Ameesha Patel: కుర్రాళ్లు డేటింగ్‌కు పిలుస్తున్నారు.. నచ్చితే పెళ్లికి రెడీ అంటున్న 50 ఏళ్ల బాలీవుడ్ బ్యూటీ!

టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితురాలైన బాలీవుడ్ బ్యూటీ అమీషా పటేల్.  అయితే ఇప్పుడు తన వ్యక్తిగత జీవితం గురించి చేసిన సంచలన వ్యాఖ్యలో నెట్టింట వైరల్ అవుతున్నాయి. 2000 సంవత్సరంలో 'కహో నా ప్యార్ హై'  బ్లాక్‌బస్టర్‌తో సినీ రంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత తన అందం, స్క్రీన్ ప్రెజెన్స్‌తో తక్కువ కాలంలోనే స్టార్‌డమ్‌ను అందుకుంది ఈ ముద్దుగుమ్మ. 50 ఏళ్లు దాటినా ఇంకా పెళ్లి చేసుకోలేదు. 

టాలీవుడ్ ఎంట్రీ..

తెలుగులో పవన్‌ కల్యాణ్‌ సరసన నటించిన 'బద్రి' (2000) అఖండ విజయం సాధించడంతో ఆమె క్రేజ్ మరింత పెరిగింది. అయితే, తెలుగులో మహేశ్‌బాబుతో 'నాని' (2004), జూ. ఎన్టీఆర్‌తో 'నరసింహుడు' (2005), బాలకృష్ణతో 'పరమవీర చక్ర' (2011) వంటి చిత్రాలు ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో ఆమెకు టాలీవుడ్‌లో అవకాశాలు తగ్గాయి. అయినప్పటికీ, 2023లో వచ్చిన 'గదర్ 2' ఘన విజయంతో ఆమె మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్‌ను విజయవంతంగా ప్రారంభించింది.

 పెళ్లి, డేటింగ్‌పై బోల్డ్ కామెంట్స్

ప్రస్తుతం 50 ఏళ్లు దాటినా, వయసుకు మించిన అందంతో మెరిసిపోతున్న అమీషా పటేల్.. ఇప్పటికీ పెళ్లి చేసుకోకపోవడంతో తరచుగా రిలేషన్‌షిప్ రూమర్స్‌తో వైరల్ అవుతోంది.. ఈ అంశంపై తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అమీషా చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. "నా వయసులో సగం ఉన్న కుర్రాళ్లు కూడా నన్ను డేటింగ్‌కు పిలుస్తున్నారు. ఈ విషయంలో నేను చాలా ఓపెన్‌గా ఉన్నాను. వయసు అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమే. మానసిక పరిపక్వత, అనుకూలత ఉంటే, ఎవరినైనా ఎంచుకోవడానికి నేను రెడీ. అని చెప్పుకొచ్చిందీ భామ..

 ఇంకా పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఇదే..

అలాగే, తాను ఇంకా పెళ్లి చేసుకోకపోవడానికి గల కారణాన్ని కూడా అమీషా పటేల్ వివరించారు. తన కెరీర్ పట్ల ఉన్న అంకితభావమే దీనికి ముఖ్య కారణమని తెలిపారు. గతంలో తనకు వచ్చిన పెళ్లి ప్రతిపాదనలన్నీ.. సినిమాలు మానేయాలి, ఇంటికే పరిమితం కావాలి అనే షరతుతో కూడినవని, అందుకే వాటన్నింటినీ తిరస్కరించానని స్పష్టం చేశారు. ప్రేమ, పెళ్లి కంటే తన కెరీర్‌నే ముఖ్యంగా భావించానని పేర్కొంది..

►ALSO READ | Ravi Teja , Samantha: రవితేజ - సమంత ఫ్రెష్ కాంబో.. శివ నిర్వాణ క్రైమ్ థ్రిల్లర్‌లో మాస్ సర్ప్రైజ్!

గతంలో దర్శకుడు విక్రమ్ భట్ వంటి వారితో ఆమె ప్రేమాయణం నడిపినప్పటికీ..  కెరీర్ కోసం ఆ ప్రేమను వదులుకున్నట్లు అమీషా పలు సందర్భాల్లో వెల్లడించారు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఒక ప్రముఖ వ్యాపారవేత్తతో ప్రేమలో ఉన్నారనే ఊహాగానాలు వినిపిస్తున్న వేళ, ఆమె ఈ వ్యాఖ్యలు చేయడం మరింత వైరల్‌గా మారాయి. సరైన, తన కెరీర్‌ను గౌరవించే వ్యక్తి దొరికితే తాను ఎప్పుడైనా పెళ్లికి సిద్ధమేనని అమీషా స్పష్టం చేశారు..