- జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్ టౌన్/చొప్పదండి, వెలుగు: ఎన్నికల కమిషన్ నిబంధనలను తప్పకుండా పాటిస్తూ నామినేషన్ ప్రక్రియ పూర్తిచేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. గురువారం కరంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లోని నామినేషన్ సెంటర్‌ను మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్‌తో కలిసి హెల్ప్ డెస్క్, పోలీస్ బందోబస్తును పరిశీలించారు. ఎలాంటి పొరపాట్లు జరగకుండా నామినేషన్ల ప్రక్రియ పూర్తిచేయాలని ఆదేశిచారు. మున్సిపల్ ఎన్నికల్లో ఎలాంటి పొరపాట్లు లేకుండా పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని అన్నారు.
అనంతరం బల్దియా ఆఫీస్‌లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను పరిశీలించారు. కమాండ్ కంట్రోల్‌లో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. అంతకుముందు చొప్పదండి మున్సిపాలిటీలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాలను పరిశీలించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పక్కాగా అమలయ్యేలా చూడాలన్నారు.
