ఎన్నికల ప్రచారంలో మల్లారెడ్డి స్టెప్పులు

ఎన్నికల ప్రచారంలో మల్లారెడ్డి స్టెప్పులు

ఎల్లంపేటలో మొదటిసారి మున్సిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎమ్మెల్యే మల్లారెడ్డి గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజబొల్లారం తండాలో మహిళలతో కలిసి ధూంధామ్ డాన్స్‌ చేసి అందరినీ ఆకట్టుకున్నారు. మల్లారెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ రెండేళ్ల పాలనలో అభివృద్ధి చేసిందేమీ లేదని, మేడ్చల్ జిల్లాలో గతంలో తండాలను గ్రామ పంచాయతీలుగా చేసింది కేసీఆర్‌యేనని చెప్పారు. కేసీఆర్ చేసిన అభివృద్ధిని గుర్తుచేసుకొని కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. – వెలుగు, మేడ్చల్