సికింద్రాబాద్ కాంగ్రెస్ లేబర్ సెల్ చైర్మన్గా తేజ గౌడ్

సికింద్రాబాద్ కాంగ్రెస్ లేబర్ సెల్ చైర్మన్గా తేజ గౌడ్

ముషీరాబాద్, వెలుగు: కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ జిల్లా లేబర్ సెల్ చైర్మన్​గా సీనియర్ నాయకులు తేజ గౌడ్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా గురువారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల సంక్షేమానికి అనేక పథకాలు ప్రవేశపెట్టిందని, కార్మికుల పక్షపాతిగా కాంగ్రెస్ పార్టీ నిలిచిందని తెలిపారు. సికింద్రాబాద్ జిల్లాలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.