- కలెక్టర్ సత్యప్రసాద్
జగిత్యాల టౌన్, వెలుగు: నామినేషన్ ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలని జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్ ఆదేశించారు. జగిత్యాలలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా నామినేషన్ల స్వీకరణకు చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నామినేషన్ల స్వీకరణలో ఎలాంటి పొరపాట్లు లేకుండా పూర్తిచేయాలని ఆదేశించారు.
అభ్యర్థులకు అవసరమైన సహకారం, సౌకర్యాలు అందించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్డీవో మధుసూదన్, డీపీవో మదన్ మోహన్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
