జ్యోతిష్యం : శ్రవణ నక్షత్రంలోకి కుజుడు.. రాబోయే 2 వారాలు.. ఊహించని మార్పులు..!

జ్యోతిష్యం : శ్రవణ నక్షత్రంలోకి కుజుడు.. రాబోయే 2 వారాలు.. ఊహించని మార్పులు..!

జ్యోతిష్యం ప్రకారం 2026 జనవరి 28 వ తేది ఆసక్తికరమైన సంఘటన ఒకటి జరిగిందని పండితులు చెబుతున్నారు.  కుజుడు మకర రాశిలో శ్రవణా నక్షత్రంలో కి ప్రవేశించాడు.  శ్రవణ నక్షత్రం చంద్రునికి సంబంధించినది. శనిగ్రహం పాలించే మకర రాశిలో కుజుడు ఫిబ్రవరి 14 వరకు సంచరిస్తాడని పండితులు చెబుతున్నారు. 

పండితులు తెలిపిన వివరాల ప్రకారం శ్రవణా నక్షత్రం.. జ్ఞానం.. తెలివితేటలు.. చదువుకు సంబంధించింది. భావోద్వేగాలు.. మనస్సును నియంత్రించడం.. ఆవేశాన్ని అదుపుచేయడం వంటివి చంద్రుడు నిర్దేశిస్తాడు. కుజుడు ( జనవరి 28 నుంచి ఫిబ్రవరి 14 వరకు) తెలివితేటలు..  ఆవేశాన్ని నియంత్రించే శ్రవణా నక్షత్రంలో సంచరిస్తాడు. 

ఇక కుజ గ్రహం శక్తి.. ధైర్యం.. ఆలోచన విధానాలను సూచిస్తాడు.  కుజుడు చంచల స్వభావాన్ని కలిగి ఉంటాడు.  ఆలోచలను స్థిరంగా ఉంచకుండా మాటి మాటికి మారుస్తూ ఉంటాడు.  అందుకే జాతకంలో కుజ గ్రహంతో ప్రభావితమయ్యే వారు స్థిరమైన ఆలోచనలు తీసుకోలేరని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.  అలాంటి కుజ గ్రహం మకరరాశిలోకి ప్రవేశించనుంది.
 
శ్రవణా నక్షత్రంలో కుజుని సంచారం..

మకరరాశిలో... శ్రవణా నక్షత్రంలో ....కుజుడి సంచారం  తెలివితేటలకు.. ఆవేశానికి ముడిపడిఉన్నాయి.  ఈ సమయంలో ఏదైనా నిర్ణయం తీసుకొనేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోవాలని పండితులు సూచిస్తున్నారు.  ప్రతి విషయాన్ని ఒకటికి .. రెండు,, మూడు సార్లు ఆలోచించాలని పండితులు సూచిస్తున్నారు. ఇతరులతో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించండి. క్లిష్టంగా..కష్టంగా ఉన్న విషయాలపై నిర్ణయం తీసుకోకపోవడమే మంచిది.  మీకున్న ఆలోచనలను అమలు పరిచే విషయంలో ప్రణాళికను రూపొందించుకోవాలని పండితులు సూచిస్తున్నారు. 

కుజుడు ... శ్రవణా నక్షత్రంలో సంచరించే సమయంలో ఎదుటి వ్యక్తులు చెప్పే విషయాన్ని జాగ్రత్తగా వినాలి.  తొందరపడి రియాక్ట్​ కావద్దు. ముందు వారు ఏం చెపుతున్నారో వినండి.. చాలా అవసరమైతే తప్ప ఎలాంటి సమాధానం చెప్పవద్దని పండితులు చెబుతున్నారు. అయితే కొత్త వ్యాపారాలు ప్రారంభించేందుకు అనుకూలసమయని పండితులు చెబుతున్నారు. కొంతమందికి సమాజంలో గౌరవం.. కీర్తి ... ప్రతిష్టలు పెరుగుతాయి.  మార్కెటింగ్​ఫీల్డ్​ లో ఉన్నవారికి ఫలితాలు అద్భుతంగా ఉంటాయని జ్యోతిష్య పండితుల అంచనా. విద్యార్థులకు.. ఉపాధ్యాయ వృత్తి వారికి అనుకూలంగా ఉంటుంది. ఏ విషయాన్ని కూడా అతిగా ఆలోచించవద్దని పండితులు చెబుతున్నారు.