తెలుగు రాష్ట్రాల సీఎంల సరదా ముచ్చట్లు.. ముసిముసి నవ్వులు.. ఎక్కడ కలిశారంటే..

తెలుగు రాష్ట్రాల సీఎంల సరదా ముచ్చట్లు.. ముసిముసి నవ్వులు.. ఎక్కడ కలిశారంటే..

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒకే వేదికపై పక్కపక్కనే కూర్చుని ముచ్చటించుకున్నారు. సీరియస్ పాలిటిక్స్ను కాసేపు పక్కన పెట్టి సరదాగా నవ్వుకుంటూ కనిపించారు. రామోజీ ఎక్సలెన్స్ అవార్డ్స్ కార్యక్రమం ఈ అరుదైన దృశ్యానికి సాక్ష్యంగా నిలిచింది. ఒకరితో ఒకరు కబుర్లు చెప్పుకుంటూ ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల స్నేహపూర్వక సంబంధాలు ఇరు రాష్ట్రాల మధ్య పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారానికి దోహదపడతాయని ఈ వీడియో చూసిన కొందరు నెటిజన్లు అభిప్రాయపడ్డారు. రామోజీ ఎక్సలెన్స్ అవార్డ్స్ కార్యక్రమంలో సీఎం రేవంత్ మాట్లాడుతూ.. అధికారిక కార్యక్రమాల్లో తెలుగు భాషకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. జీవోలు కూడా తెలుగులో ఇచ్చేలా దశల వారీగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఇక.. ఏపీ, తెలంగాణ మధ్య బనకచర్ల వివాదం నడుస్తున్న విషయం విదితమే. ఏపీ చేపడుతున్న పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు విభజన చట్టంలోని నిబంధనలకు విరుద్ధమని తెలంగాణ తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. బనకచర్ల లింక్ ​ప్రాజెక్టుకు సోర్స్​పోలవరమే. దీంతో ఆ ప్రాజెక్టు స్కోప్​ మారిపోయింది. ఏపీ కట్టినట్టే ఎగువ రాష్ట్రాలూ ఇలాగే ప్రాజెక్టులను కట్టుకుంటూ పోతే దిగువ రాష్ట్రాలకు చుక్క నీరు కూడా రాదని తెలంగాణ ఆందోళన వ్యక్తం చేస్తోంది.