హైదరాబాద్: బోరబండలో హిజ్రాల మధ్య వివాదం చెలరేగింది. ఓ హిజ్రా తీరుకు నిరసనగా కొందరు హిజ్రాలు రోడ్డుపై ఆందోళనకు దిగారు. తప్పుడు కేసులతో తమను వేధిస్తోందని హిజ్రాలు ఆరోపించారు. ఈ క్రమంలో కొందరు హిజ్రాలు పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నారు. ఈ ఘటనలో ముగ్గురు హిజ్రాలు తీవ్రంగా గాయపడటంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. హిజ్రాలో ఆందోళనతో బోరబండలో ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని హిజ్రాలతో చర్చిస్తున్నారు. హిజ్రాల ఆందోళనతో భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
