- నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి
హాలియా, వెలుగు: రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రయించి ప్రభుత్వం కల్పించే మద్దతు ధరను పొందాలని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందురు జైవీర్ రెడ్డి అన్నారు. ఆదివారం నల్గొండ జిల్లా త్రిపురారం మండలం రాగడప గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు పండించిన చివరి ధాన్యపు గింజ వరకు ప్రభుత్వమే కొననుగోలు చేస్తుందన్నారు.
రైతులు నేరుగా ఐకేపీ కేంద్రాల్లో అమ్ముకుని ప్రభుత్వం అందిస్తున్నన క్వింటాల్‌కు రూ. 500 బోనస్‌ను పొందాలన్నారు. అనంతరం త్రిపురారం మండలం మాజీ ఎంపీపీ అనుముల పాండమ్మ శ్రీనివాస్ రెడ్డి ల పెద్ద కుమారుడు అనుముల వెంకట్రాంరెడ్డి ఇటీవల కాలంలో అనారోగ్యంతో మృతి చెందగా, వారి కుటంభ సభ్యులను నసాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా వెంకట్రాంరెడ్డి చిత్రపటానికి నివాళులర్పించారు. కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో నిడమనూరు మార్కెట్ చైర్మన్ అంకతి సత్యం, మిడిమాల బుచ్చిరెడ్డి, శ్రీనివాసరెడ్డి, చంద్రారెడ్డి, నరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
