ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి కేసు విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. 2022లో భారత పౌరసత్వాన్ని వదులుకున్న ఇమ్మడి రవి.. 2022లో కరేబియన్ పౌరసత్వాన్ని తీసుకున్నట్లు గుర్తించారు. రూ. 80 లక్షలు చెల్లించి కరేబియన్ పౌరసత్వం పొందాడు రవి. 2022 నుంచి కరేబియన్ దీవుల్లో ఉంటున్నాడు ఐ బొమ్మ రవి.
హైదరాబాద్, వైజాగ్‌లో ఉన్న ఆస్తులను అమ్మే యోచనలో ఉన్నాడు రవి. ఈ క్రమంలోనే మూడు రోజుల క్రితం హైదరాబాద్ కు వచ్చాడు రవి. ప్రైవేట్ రియల్ ఎస్టేట్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్న రవి ..ముస్లిం అమ్మాయిని ప్రేమ వివాహం చేసుకున్న రవి కొన్నాళ్లకే విడిపోయారు. టెక్నాలజీ పరంగా దిట్ట కావడంతో ఐబొమ్మను క్రియేట్ చేసిన రవి.. ఓటీటీ కంటెంట్‌ను డీఆర్ఎమ్ టెక్నాలజీ ద్వారా హ్యాక్ చేసి అప్‌లోడ్ చేస్తున్నాడు. మూవీరూల్జ్ ద్వారా కంటెంట్ తీసుకుని HDలోకి మారుస్తున్నాడు రవి.. 60 వెబ్‌సైట్లు క్రియేట్ చేసి పైరసీ కంటెంట్‌ను పోస్టు చేస్తున్నాడు. ఇప్పటి వరకు వందల కోట్లు రూపాయలు సంపాదించినట్లు గుర్తించారు పోలీసులు. కరేబియన్ దీవుల్లో విలాసవంతమైన జీవితం గడుపుతున్నాడు రవి.
తెలుగు సినిమాలను పైరసీ చేస్తూ సినీ ఇండస్ట్రీకి, పోలీసులకు సవాలుగా మారిన ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి ఎట్టకేలకు పోలీసులకు చిక్కిన సంగతి తెలిసిందే. నవంబర్ 15 శనివారం ఉదయం నెదర్లాండ్స్ నుంచి హైదరాబాద్కు వచ్చిన రవిని కూకట్‌పల్లిలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రవి విదేశాల్లో ఉంటూ పైరసీ తతంగాన్ని నడిపాడు. అందుకు స్థానికంగా ఉన్న కొద్దిమంది వ్యక్తుల సహకారం కూడా తీసుకున్నాడు. ఇటీవల ఈ పైరసీకి సహకరిస్తున్న పలువురిని పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.
