ఫుల్ ట్రాఫిక్.. వాహనాలు ముందుకు కదలడం లేదు.. ఒక గంట కాదు.. రెండు గంటలు కాదు.. ఏకంగా నాలుగు గంటలు ట్రాఫిక్ లోనే.. వెళ్లాల్సింది పీఎం మోదీ ఇచ్చిన విందుకు.. టెన్షన్ టెన్సన్.. AI ఇంపాక్ట్ సమ్మిట్ సెషన్ల తర్వాత డ్రెస్ లో మార్చుకొని వద్దామని హోటల్ కు వెళ్లాను అంతే తిరిగి రాలేకపోయాను.. పీఎం మోదీ డిన్నర్ కు వచ్చే క్రమంలో ఇది పరిస్థితి.. ఇది తాను కష్టాలపై AIసమ్మిట్ హాజరైన అమెరికన్ టెక్ కంపెనీ సీఈవో కామెంట్స్..
సారా హుకర్.. ప్రముఖ అమెరికన్ టెక్ కంపెనీ అడాప్షన్ ల్యాబ్ వ్యవస్థాపక సీఈవో.. గురువారం (ఫిబ్రవరి 18) రాత్రి ఢిల్లీలో ట్రాఫిక్ కారణంగా ప్రధాని మోదీ ఇచ్చిన డిన్నర్ హాజరుకాలేకపోయానని తన ఆందోళన వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. మెగా సమ్మిట్ కోసం ఢిల్లీకి వచ్చిన కొంతమంది VIP ప్రతినిధులు.టెక్ లీడర్ల కోసం గాలా డిన్నర్ ఏర్పాటు చేశారు ప్రధాని. దురదృష్టవశాత్తు సారా హుకర్ డిన్నర్ కు రాలేకపోయింది. AI సమ్మిట్ సెషన్ల తర్వాత జీన్స్ లో ఉన్న ఆమె.. డ్రెస్ మార్చుకునేందుకు హోటల్ కు వెళ్లాను..తిరిగి గాలాకు వచ్చే క్రమంలో ట్రాఫిక్ లో ఇరుకున్నారు. నాలుగు గంటల పాటు కారులోనే ఉండిపోయాను అని ట్వీట్ చేసింది.
చివరికి హుకర్ తన హోటల్ రూం కి తిరిగి వచ్చి ఫుడ్ ఆర్డర్ చేసింది. ప్రధాని విందుకు హాజరయితే గౌరవంగా ఉండేది.. 4 గంటల ట్రాఫిక్ తర్వాత రాత్రి 11 గంటలకు అద్భుతమైన రూం సర్వీస్ ను పొందాను.. ఇది అంతే గౌరవంగా భావిస్తున్నాను అంటూ హుకర్ ట్వీట్ లో రాశారు. ట్వీట్ వైరల్ అవుతోంది.
నిన్న రాత్రి సెంట్రల్ ఢిల్లీలో జరిగిన ట్రాఫిక్ గందరగోళంలో అడాప్షన్ ల్యాబ్స్ CEO ఒక్కరే బాధితుడు కాదు. భారత్ మండపం వెలుపల ఉన్న రోడ్డు VIPల కదలిక కోసం బ్లాక్ చేయబడటంతో కిలోమీటర్ల కొద్దీ నడవాల్సి వచ్చిందని AI సమ్మిట్‌కు హాజరైన అనేక మంది చెప్పారు.
సమీపంలోని మెట్రో స్టేషన్ మూసివేయబడి, క్యాబ్‌లు లోపలికి ప్రవేశించకుండా నిషేధించడంతో, సమ్మిట్‌కు వచ్చిన అతిథులు క్యాబ్‌లు బుక్ చేసుకోవడానికి కిలోమీటర్ల దూరం నడిచారు. చాలా మంది సోషల్ మీడియా ద్వారా ఫిర్యాదు చేశారు.
నిన్న సెంట్రల్ ఢిల్లీ ట్రాఫిక్ గందరగోళానికి ఒక్క అడాప్షన్ ల్యాబ్ సీఈవోనే బాధితురాలు కాదు.. భారత్ మండపం దగ్గర వీఐపీలకోసం బ్లాక్ చేయడంతో కిలోమీటర్ల మేర నడవాల్సిన పరిస్థితి వచ్చిందని సమ్మిట్ హాజరైన చాలా మంది ఆందోళన వ్యక్తం చేశారు.
భారత్ మండపం సమపీంలో మెట్రో స్టేషన్లు మూసివేయడం, క్యాబ్ లు లోపలికి రాకుండా నిషేధం, సమ్మిట్ కు వచ్చిన గెస్ట్ లు క్యాబ్ లు బుక్ చేసుకోవాలని కిలోమీటర్లు నడవాల్సి వచ్చింది. చాలా మంది సోషల్ మీడియా పోస్టుల ద్వారా ఫిర్యాదు చేశారు.
వీఐపీల రాకపోకలతో ఏఐ సమ్మిట్ వేదిక దగ్గర గంటలపాటు ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఓపిక లేక విసిగిపోయిన బైకర్లు ట్రాఫిక్ జామ్ నుంచి బయటపడేందుకు డివైడర్లు దాటుతున్న దృశ్యాలు సోషల్ మీడియలో వైరల్ అయ్యాయి.
