నటుడు వంశీ తుమ్మల, సంధ్యా వశిష్ఠ ప్రధాన పాత్రల్లో నటించిన ఎమోషనల్ డ్రామా శ్రీ చిదంబరం గారు. వినయ్‌రత్నం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం కేవలం వినోదాన్ని మాత్రమే కాకుండా, సున్నితమైన భావోద్వేగాలతో కూడిన ఫీల్ గుడ్ డ్రామాగా నిలిచింది. ఫిబ్రవరి 6న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల హృదయాలను హత్తుకుంది. 27 ఏళ్ల యంగ్ డైరెక్టర్ వినయ్‌రత్నం రాసుకున్న ఈ సెన్సిబుల్ స్టోరీ ఎంతోమందిని కదిలించింది.
తన ఫస్ట్ స్పీచ్ తోనే తన ఇంటెన్సిటీని అంతా చూపించాడు. ప్రతిఒక్కరికీ డ్రీమ్ ఉంటుంది. కానీ, దాన్నీ సపోర్ట్ చేసే వ్యక్తులు తోడుండాలి. అలా తన సినిమా కెరీర్కి సహాయపడ్డ ఫ్రెండ్స్, సినీ మేకర్స్ని తలుచుకుంటూ తన ప్రయాణాన్ని మాటలతో చూపించేశాడు.
అలా మొదటి ప్రయత్నంలోనే ఒక మంచి సినిమాను అందించి విమర్శకుల ప్రశంసలు అందుకోవడం వినయ్‌రత్నం ప్రతిభకు నిదర్శనంగా నిలిచింది. భావోద్వేగాలను హృదయానికి హత్తుకునేలా చెప్పడంలో ఆయన చూపిన నైపుణ్యం పరిశ్రమలో ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చిపెట్టింది.
శ్రీ చిదంబరం గారు కథ:
ఈ చిత్రం మన చుట్టూ ఉండే మనుషుల కథలా, నిత్యం మనం చూసే మధ్యతరగతి కష్టసుఖాల కలబోతలా అనిపిస్తోంది. ఇందులో హీరో మెల్లకన్ను లోపంతో బాధపడుతూ ఉంటాడు. సమాజం తనను చూసే తీరును తట్టుకోలేక ఊరు విడిచి వెళ్లాలనుకునే పరిస్థితి వస్తుంది. “తల దించుకుని నడిచి నడిచి మెడ లాగేస్తోందమ్మా.. ఇప్పుడన్నా నన్ను తలెత్తుకొనీయమ్మా అంటూ చిదంబరం పాత్రలో హీరో పలికే సంభాషణలు గుండెలను పిండేస్తాయి. సమాజంలో ఆత్మగౌరవం కోసం పోరాడే ఒక మధ్యతరగతి వ్యక్తి కథే ఇది.
ఇలాంటి చిన్నచూపు ఫేస్ చేస్తున్న హీరో జీవితంలోకి హీరోయిన్ అడుగుపెట్టడంతో కథ మలుపుతీసుకుంటుంది. ఆ తర్వాత ఇద్దరి మధ్య పెరిగే ప్రేమ, కుటుంబాల నుంచి ఎదురయ్యే అడ్డంకులు, వారు ఎదుర్కొన్న భావోద్వేగ సంఘర్షణలే కథా ప్రధానాంశాలు.
శ్రీ చిదంబరం గారు ఓటీటీ:
ఎమోషనల్ రైడ్‌గా సాగిన ‘శ్రీ చిదంబరం గారు’ విడుదలై నెలరోజులు కాకముందే ఓటీటీకి రానుందని మేకర్స్ ప్రకటించారు. మొదటగా ఫిబ్రవరి 19 నుంచి స్ట్రీమింగ్ ప్రారంభమవుతుందని తెలియజేశారు. అయితే అనూహ్యంగా ఈ తేదీని వాయిదా వేశారు. ఫిబ్రవరి 19న విడుదలై ఉంటే కేవలం 13 రోజుల్లోనే ఓటీటీ ప్రీమియర్ అయినట్లయ్యేది.
New date. Same blockbuster magic.
— ETV Win (@etvwin) February 19, 2026
The film that touched millions is ready to shine again. ✨
Sri Chidambaram Garu premieres Feb 26 on @etvwin 🌟@worldofvamsi #SandhyaVasishta @VinayRatnam_ #ChintaVineeshaReddy #ChintaGopalaKrishnaReddy #ChintaRajasekharReddy @chandu_music… pic.twitter.com/GWDFBc3hOG
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ‘శ్రీ చిదంబరం గారు’ ఫిబ్రవరి 26 నుంచి ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేసి వాయిదా విషయాన్ని వెల్లడించారు. ఈ క్రమంలో థియేటర్లలో చూడలేకపోయిన ప్రేక్షకులు ఓటీటీలో ఈ ఎమోషనల్ రైడ్ ని ఆస్వాదించే అవకాశం ఉంది. ఇకపోతే ఈ సినిమాకు స్లో నెరేషన్ మైనస్‌గా మారింది.
