హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్

హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్

యాదాద్రి భువనగిరి జిల్లా: హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిపై గూడూరు టోల్ ప్లాజ్ దగ్గర ఆదివారం రాత్రి భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఆదివారం సెలవు కావడంతో.. యాదగిరిగుట్ట, స్వర్ణగిరి ఆలయాలకు భక్తులు భారీగా తరలివెళుతున్నారు. వరంగల్ ప్రయాణికులతో ఫుల్ ట్రాఫిక్ జామ్ కావడం గమనార్హం. కార్తీక మాసం చివరి ఆదివారం కావడంతో యాదాద్రి ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. సాయంత్రం నుంచి తిరుగు ప్రయాణాలు మొదలు కావడంతో గూడూరు టోల్ గేట్ వద్ద ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. హైదరాబాద్ వైపు వాహనాలు నెమ్మదిగా వెళ్తున్నాయి. 

కార్తీక మాసం చివరి వారానికి తోడు ఏకాదశి పర్వదినం కావడంతో శనివారం కూడా యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి భక్తులు పోటెత్తారు. నారసింహుడి దర్శనానికి 3 గంటలు, స్పెషల్ దర్శనానికి గంటకు పైగా సమయం పట్టింది. 19 వందల 53 మంది దంపతులు వ్రతాలు చేశారు. ఒక్క రోజే వ్రతాల ద్వారా రూ.19.53 లక్షలు, పలు రకాల పూజలు, నిత్య కైంకర్యాల ద్వారా రూ.54.94 లక్షల ఆదాయం సమకూరింది.