
- రాష్ట్రపతి భవన్లో ‘ఎట్ హోం’ నేపథ్యంలో వెహికల్ డైవర్షన్
కంటోన్మెంట్, వెలుగు: బొల్లారంలోని రాష్ట్రపతి భవన్లో శుక్రవారం ‘ఎట్ హోం’ కార్యక్రమం జరగనున్న నేపథ్యంలో సిటీ ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు లోతుకుంట టీ జంక్షన్, ఎంసీఈఎంఈ సిగ్నల్, లాల్ బజార్ టీ జంక్షన్, తిరుమలగిరి క్రాస్ రోడ్స్, సికింద్రాబాద్ క్లబ్ ఇన్ గేట్, టివోలి క్రాస్ రోడ్స్, ప్లాజా క్రాస్ రోడ్స్, సీటీవో, ఎస్ బీఐ జంక్షన్, రసూల్‌పురా, పీఎన్టీ ఫ్లై ఓవర్, గ్రీన్ లాండ్స్, మోనప్ప జంక్షన్, వీవీ విగ్రహం జంక్షన్, ఖైరతాబాద్, పంజాగుట్ట, ఎన్ఎఫ్ సీఎల్, ఎన్టీఆర్ భవన్, జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయని పోలీసులు తెలిపారు. వాహనదారులు ఇతర మార్గాల్లో వెళ్లాలని సూచించారు.