Tirumala: శ్రీవారి సన్నిధిలో సినీ ప్రముఖులు.. వెంకన్నను దర్శించుకున్న అల్లు ఫ్యామిలీ

Tirumala: శ్రీవారి సన్నిధిలో సినీ ప్రముఖులు.. వెంకన్నను దర్శించుకున్న అల్లు ఫ్యామిలీ

ప్రముఖ తెలుగు సినీ ప్రముఖులు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. బుధవారం ఏప్రిల్ 1, 2026న స్టార్ హీరో అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహ రెడ్డి తన పిల్లలు అయాన్, అర్హ లతో కలిసి శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికి తీర్థప్రసాదాలు అందజేశారు. అలాగే కన్నడ నటి తార కూడా శ్రీవారి దర్శనం చేసుకున్నారు.

ఈ సందర్భంలోనే టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ దర్శకుడు ఎస్. వి. కృష్ణారెడ్డి మరియు నిర్మాత అచ్చి రెడ్డి కూడా తిరుమలలో స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం వీరికి ఆలయ వేదపండితులు ఆశీర్వచనాలు అందజేశారు. ఈ క్రమంలోనే సినీ ప్రముఖుల రాకతో తిరుమలలో భక్తుల సందడి మరింత పెరిగింది. ప్రస్తుతం అల్లు స్నేహ తిరుమల సందర్శించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అల్లు అర్జున్-స్నేహారెడ్డి: 

టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ అంటే అల్లు అర్జున్-స్నేహారెడ్డి అనడంలో సందేహం లేదు. స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగా గుర్తింపు పొందుతూనే..సోషల్ మీడియాలో కూడా ఫాలోవర్లను పెంచుకుంటోంది. ఈ జంట ఎక్కడా కనిపించిన కన్నుల పండుగలా మారిపోతుంది.

ప్రస్తుతం అల్లు అర్జున్ కెరీర్లో వరుస విజయాలతో ఎంతో దూసుకుపోతున్నారు. ఆయన నటించిన చివరి చిత్రం 'పుష్ప 2: ది రూల్' ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో  భారీ సైన్స్-ఫిక్షన్ చిత్రమైన 'AA22 x A6' షూటింగ్ లో బిజీగా ఉన్నారు.