టమోటా చెడిపోకుండా ఉండాలంటే ఇలా చేయండి..

టమోటా చెడిపోకుండా ఉండాలంటే ఇలా చేయండి..

టమోటా అంటేనే జనాలకు భయమేస్తుంది మరి దాని ధర అలా ఉంది. కాని ఏం చేస్తారు.. టమాటా లేనిదే ఏ కూర చేయాలన్నా కష్టమే కదా.. మరి.. అందులోనూ తొందరగా చెడిపోయే కూరగాయల్లో టమాటా ముందుంటుంది.  అయితే కొన్ని టిప్స్ పాటిస్తే తొందరగా చెడిపోదని చెబుతున్నారు నిపుణులు. ప్రస్తుతం టమోటా ధరలు పరుగులు పెడుతున్నాయి.. 200 లకు పైగా కిలో టమోటాలు పలుకుతున్నాయి. అయితే టమోటా లేనిదే కూరలు బాగోవు.. కొందరు ధర ఎక్కువైనా కూడా కొంటున్నారు.. అయితే ఇలాంటి పరిస్థితుల్లో టమాటాలను ఇంట్లోనే నిల్వ చేసుకునేందుకు ప్రజలు కొత్త పద్ధతులను అవలంబిస్తున్నారు.. ఈ టిప్స్ ను పాటించడం వల్ల టమోటాలను కనీసం పది రోజులు నిల్వ ఉంచుకోవాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వాల్సిందే.. ఏం చెయ్యాలో ఇప్పుడు తెలుసుకుందాం..

టమోటాలు 10 రోజులు నిల్వ చేయాలనుకుంటే... మొదట అన్ని టమోటాలు కడగడం లేదా తుడవడం చేయాలి. ఇప్పుడు టమోటాకు ఉండే   ఆకుపచ్చ కొమ్మను పైకి ఉండే విధంగా ఉంచండి. ఇప్పుడు ఏదైనాటేప్ తీసుకొని దానిని కత్తిరించి ఈ కాండాలపై వేయండి.   పూర్తిగా కప్పి ఉండేలా టేప్ ఉండాలా టేప్ వేయాలి. ఈ విధంగా చేయడం వలన టమోటాల్లో ఇన్ ఫెక్షన్ చేరే అవకాశం ఉండదు.. రంగు కూడా మారదు.   .. మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వండుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. టమోటాటో   ఆకుపచ్చ కొమ్మపై టేప్ వేయడం వలన , అది గాలిలో ఉన్న బ్యాక్టీరియా లేదా ఫంగస్‌ను దరి చేరనివ్వదు.   దాని కారణంగా దానిలో ఎటువంటి మార్పు ఉండదు. అది అలాగే ఉంటుంది..

 ప్రస్తుతం వర్షాల కారణంగా అన్ని కూరగాయల ధరలు భారీగా పెరుగుతున్నాయి.. ఇక టమోటా ధరలకు బ్రేకులు పడటంలేదు.. రోజు రోజుకు పెరుగుతున్నాయి.. ఇప్పుడున్న ధరల వల్ల ఎంత పొదుపుగా వాడుకుంటే అంత మంచిదని నిపుణులు చెబుతున్నారు.. ప్రస్తుతం  మార్కెట్ లో టమోటా  ధర 200 రూపాయిలకు పైగా ఉంది.  ఇది ప్రతి ఒక్కరు గుర్తుంచుకొని ఉంటే మంచిది.. ఒక్క టమోటా మాత్రమే కాదు దోసకాయలు, క్యాబేజిలను కూడా ఇలానే స్టోర్ చెయ్యొచ్చు అని నిపుణులు అంటున్నారు..మీకు  వీలైతే ఇలా ట్రై చెయ్యండి.. ఫ్రెష్ గా ఉంటాయి.