రేపు MLA  కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు

రేపు MLA  కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు

రేపు (మంగళవారం) రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి.  ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ఐదు MLC స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రిటర్నింగ్‌ అధికారి వి. నరసింహాచార్యులు పేర్కొన్నారు. అసెంబ్లీలోని కమిటీహాల్‌-1లో పోలింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికలు రేపు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనున్నాయి. సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. MLC ఎన్నికల సందర్భంగా అసెంబ్లీ  దగ్గర పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.