టూల్స్​ & గాడ్జెట్స్​ రంగులు మారే ఫాసెట్​

టూల్స్​ & గాడ్జెట్స్​ రంగులు మారే ఫాసెట్​

ట్యాప్​ నుంచి వచ్చే నీళ్లు చేత్తో చూడకుండానే వేడిగా ఉన్నాయా... చల్లగా ఉన్నాయా... చెప్పగలమా? ఈ ఫాసెట్​ ట్యాప్​కి బిగిస్తే.. చెప్పొచ్చు.  
ఎండాకాలంలో బయటికి వెళ్లినప్పుడు ‘కాసేపు చల్లని గాలి తగిలితే బాగుంటుంది’ అనిపిస్తుంది. అందుకోసమే మనతో పట్టుకెళ్లే ఫ్యాన్​. ఇలా... మనం రెగ్యులర్​గా చేసే పనులు కాస్త సులభంగా చేసేందుకు ఉపయోగపడే కొన్ని గాడ్జెట్స్ అండ్​ టూల్స్​​ ఇవి. 

హిబ్రోన్​ ఫ్యాన్​ 

ఎండాకాలం వచ్చేసింది.. ఉక్కపోత మొదలైంది. అందుకే అందరూ కూలర్లు, ఏసీలు వాడడం మొదలుపెట్టారు. ఇంట్లో ఉన్నప్పుడు వాటిని వాడుతున్నారు సరే.. మరి బయటికి వెళ్లినప్పుడు? అందుకోసమే మార్కెట్​లోకి కొన్ని పోర్టబుల్​ ఫ్యాన్లు వచ్చేశాయి. ఓ అడుగు ముందుకేసి హిబ్రోన్​ కంపెనీ వెయిస్ట్​ ఫ్యాన్​ తీసుకొచ్చింది. బయటికి వెళ్లేటప్పుడు దీన్ని బెల్ట్​కి పెట్టుకుని ఆన్​ చేస్తే చాలు. ముఖానికి చల్లని గాలి తగులుతుంది. ఈ ఫ్యాన్​లో 6000 mAh బ్యాటరీ ఉంటుంది. అందువల్ల దీన్ని పవర్​ బ్యాంక్​గా కూడా వాడుకోవచ్చు. ఇందులో ఒక టార్చ్​ లైట్​ కూడా ఉంటుంది.
ధర:4,000 రూపాయలు

లైట్​ ఛేంజింగ్​ టెంపరేచర్​ సెన్సర్​ 

దాదాపు అందరి ఇళ్లలో ఎలక్ట్రానిక్​ గీజర్లు వాడుతున్నారు. వాటి ద్వారా నీళ్లు వేడెక్కి, డైరెక్ట్​గా ట్యాప్​ నుంచి వస్తాయి. అయితే.. అవి ఎంత వేడిగా ఉన్నాయో తెలుసుకోవాలంటే నీళ్లలో చెయ్యి పెట్టి చూడాల్సిందే. అలాకాకుండా.. ఈ ఫాసెట్​ బిగిస్తే చేత్తో చూడాల్సిన అవసరమే లేదు.  లింబాని బ్రదర్స్​ కంపెనీ తీసుకొచ్చిన ఈ లైట్​ ఛేంజింగ్​ ఫాసెట్​ నీళ్ల టెంపరేచర్​ని బట్టి లైట్​ రంగుని మారుస్తుంటుంది. ఇందులో ఉండే లైట్​ ఏడు రంగుల్లో వెలుగుతుంది. నీళ్లు బాగా వేడిగా ఉంటే ఎరుపు రంగులో, తక్కువ వేడిగా ఉంటే గ్రీన్​ కలర్​లో వెలుగుతుంది. నీళ్లు చల్లగా ఉంటే బ్లూ కలర్​ లైట్​ వస్తుంది. దీనికి బ్యాటరీలు కూడా అవసరం లేదు. ఛార్జింగ్​ పెట్టాల్సిన పని కూడా లేదు. హైడ్రాలిక్ డ్రైవ్‌‌పై ఆధారపడి పనిచేస్తుంది. ధర: 399 రూపాయలు


ఐకాల్​ ఫోన్​ హోల్డర్​


ల్యాప్​ట్యాప్​​లో వర్క్​ చేస్తున్నప్పుడు కొన్నిసార్లు ఫోన్​ కూడా వాడాల్సి వస్తుంది. అలాంటప్పుడు కాస్త ఇబ్బందే. అందుకే ఐకాల్​ కంపెనీ ల్యాప్‌‌ట్యాప్ సైడ్ మౌంట్ ఫోన్ హోల్డర్​​ తెచ్చింది. దీన్ని ల్యాప్​ట్యాప్​కి ఎటాచ్​ చేసి, వర్క్​ చేస్తూనే ఈజీగా మొబైల్​ ఆపరేట్​ చేయొచ్చు. దీన్ని ఇన్​స్టాల్​ చేయడం చాలా ఈజీ. సేఫ్టీ స్పాంజ్​ ఉండడం వల్ల ల్యాప్​ట్యాప్​​ డ్యామేజ్​ కాకుండా ఉంటుంది. మ్యాగ్నెటిక్స్​తో ఫోన్​ హోల్డ్​ అవుతుంది. కాబట్టి ఫోన్​ డ్యామేజ్​ కాదు. ఈ హోల్డర్​ అల్యూమినియంతో తయారుచేస్తారు.  ధర: 425 రూపాయలు

స్మార్ట్ ఐ-మసాజర్

కళ్లు అలసిపోయి ఇబ్బందిగా అనిపించినప్పుడు, తలనొప్పి వచ్చినప్పుడు తగ్గించుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాం. అయితే.. స్మార్ట్ ఐ–మసాజర్​తో ఈ రెండు సమస్యలకు చెక్​ పెట్టొచ్చు అంటోంది ఐగేర్ కంపెనీ. ఈ మసాజర్​ రిథమిక్ పెర్కుషన్ మసాజ్‌‌ చేసి కంటి ఒత్తిడి, తలనొప్పి నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా స్క్రీన్‌‌ ముందు ఎక్కువగా కూర్చునేవాళ్లకు, పుస్తకాలు ఎక్కువగా చదివేవాళ్లకు ఇది బాగా ఉపయోగపడుతుంది. హాయిగా నిద్రపట్టేలా చేస్తుంది. ఇందులో ఇన్​బిల్ట్​ హీటింగ్ ప్యాడ్‌‌లు ఉంటాయి. 38 నుంచి 42 డిగ్రీల సెంటీగ్రేడ్ మధ్య 3 అడ్జస్ట్​మెంట్​ లెవల్స్​ ఉంటాయి. వీటివల్ల కళ్ల చుట్టూ రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. కంటి ఉబ్బరం, బ్లాక్​ సర్కిల్స్​ తగ్గుతాయి. ఇందులో ఆరు ఇంటెలిజెంట్ లూప్‌‌లు కళ్ల చుట్టూ ఉన్న ఆక్యుపాయింట్లను కవర్ చేస్తాయి. నుదుటి మీద మసాజ్​ చేయడం వల్ల తలనొప్పి తగ్గుతుంది. దీన్ని ఎక్కడికైనా ఈజీగా క్యారీ చేయొచ్చు. ఇది 1200mAh బ్యాటరీతో వస్తుంది. ఒకసారి ఫుల్​ ఛార్జ్​ చేస్తే 15 సార్లు వాడుకోవచ్చు. 
ధర: 2,749 రూపాయలు