టూల్స్ & గ్యాజ్డెట్స్ :హెడ్​ బ్యాండ్​ మ్యాగ్నిఫయ్యర్​

టూల్స్ & గ్యాజ్డెట్స్ :హెడ్​ బ్యాండ్​  మ్యాగ్నిఫయ్యర్​

చాలామంది ఇంట్లో సరదాగా కుట్టుపని, అల్లికలు, కొన్ని రకాల చేతి పనులు చేస్తుంటారు. కొందరు పెయింటింగ్స్​ కూడా వేస్తుంటారు. అలాంటివాళ్లకు ఈ గాడ్జెట్​ బాగా పనికొస్తుంది. హెట్​క్రిషి కంపెనీ తెచ్చిన ఇల్యూమినేటెడ్ హెడ్‌‌‌‌బ్యాండ్ మాగ్నిఫయర్​​తో 5 లెన్స్‌‌‌‌లు వస్తాయి. వాటితో 1X  నుంచి 3.5X వరకూ జూమ్​ చేసి చూడొచ్చు. దీనికి ఒక ఎల్​ఈడీ లైట్​ కూడా ఉంటుంది. చీకట్లో పనిచేస్తున్నప్పుడు ఇది బాగా పనికొస్తుంది. ధర: 750 రూపాయలు

మల్టీ టూల్​కిట్​ 

చదువుకునే పిల్లలు, పేపర్​ వర్క్​ ఎక్కువగా ఉండే ఆఫీసుల్లో ఉద్యోగులు రకరకాల స్టేషనరీ టూల్స్​ వాడుతుంటారు. అలాంటి రకరకాల పనులన్నీ చేసేందుకు ఇండిట్రెడిషన్​ అనే కంపెనీ ఒక మల్టీ పర్పస్​ టూల్​ని మార్కెట్​లోకి తెచ్చింది. ఆ ఒక్క టూల్​తో పది రకాల పనులు చేయొచ్చు. ఇది స్టాప్లర్, పంచ్ మెషిన్, సిజర్స్​, రూలర్ (మెజర్‌‌‌‌మెంట్ టేప్), షార్ప్​నర్, ఓపెనర్, పిన్​ రిమూవర్, రింగ్, క్లిప్ హోల్డర్, పంచ్ వేస్ట్ బిన్​గా పనిచేస్తుంది. దీనిలోని టూల్స్​ని స్టెయిన్‌‌‌‌లెస్ స్టీల్​తో, హై క్వాలిటీ ప్లాస్టిక్​తో బాడీని బిల్డ్​ చేశారు. ధర: 650 రూపాయలు

కర్టెన్​ ఓపెనర్​ 

వస్తువులను దాచిపెట్టడానికి లాకర్లు వాడుతుంటారు. కానీ.. లాకర్ల తాళం చెవులను  దాచే లాకర్లు కూడా ఉంటాయి తెలుసా! టెక్నాలజీ ఎంతలా పెరిగిందంటే.. మనం చేయాల్సిన పనుల్లో చాలావరకు గాడ్జెట్స్​ చేస్తున్నాయి. కర్టెన్లు తెరిచే మిషన్​ కూడా అలాంటిదే . ఇవే కాదు.. ఇలాంటి ఎన్నో టూల్స్​, గాడ్జెట్స్​ ఉన్నాయి మార్కెట్​లో. వాటిలో కొన్ని ఇవి..  

స్విచ్​ బాట్

ఉదయం వేళల్లో శరీరానికి ఎండ తగిలితే ఆరోగ్యానికి మంచిదని చాలామంది చెప్తుంటారు. కానీ.. కొందరు ఆ టైంలో నిద్ర లేవరు. కనీసం కిటికీల కర్టెన్లు తెరిచి పడుకోవడానికి కూడా బద్ధకిస్తారు. అలాంటి వాళ్ల కోసమే ఈ గాడ్జెట్​. ఇది ఎప్పుడు కావాలంటే అప్పుడు కర్టెన్లు తెరుస్తుంది. వద్దనుకుంటే మూసేస్తుంది. స్విచ్​ బాట్ కంపెనీ మార్కెట్​లోకి తెచ్చిన ఈ చిన్న డివైజ్​ని కర్టెన్​తోపాటు రాడ్​కి ఇన్​స్టాల్​ చేస్తే చాలు. దీన్ని 30 సెకన్లలో ఈజీగా ఇన్​స్టాల్​ చేసేయొచ్చు.- స్క్రూ, బోల్ట్‌‌‌‌ల అవసరం లేదు. స్మార్ట్​ఫోన్​లో యాప్​ ఇన్​స్టాల్​ చేసి డివైజ్​ని కనెక్ట్​ చేసుకోవచ్చు. 

ఫోన్​లో ఒక్క క్లిక్​ చేస్తే చాలు కర్టెన్​ మూసుకుంటుంది. యాప్​లో షెడ్యూల్​ చేసి పెట్టుకున్న టైంకి ఆటోమేటిక్​గా కర్టెన్​ ఓపెన్​ లేదా క్లోజ్​ చేస్తుంది. అంతేకాదు.. ఇందులో సన్​ లైట్​ సెన్సర్​ కూడా ఉంది. సన్​లైట్​ రాగానే ఆటోమేటిక్​గా కర్టెన్​ తెరుస్తుంది. సన్​లైట్​ డల్​ కాగానే మూసేస్తుంది. అలెక్సా, గూగుల్​ సిరితో కూడా ఆపరేట్​ చేయొచ్చు. ఎనిమిది కిలోల బరువు ఉండే పెద్ద కర్టెన్లను కూడా ఈజీగా నెట్టగలదు. ధర: 13,000 రూపాయలు

తాళం చెవుల తాళం

ఒక తాళం చెవి అయితే.. ఈజీగా క్యారీ చేయొచ్చు. కానీ.. బీరువా, కబోర్డ్స్​, సేఫ్టీ లాకర్​ కీలన్నీ వెంట తీసుకెళ్లాలంటే కష్టమే. ఒకవేళ ఇంట్లో పెట్టి వెళ్దామంటే.. కొందరి ఇళ్లకు ఎప్పుడూ గెస్ట్​లు వచ్చి వెళ్తుంటారు. కాబట్టి అంత సేఫ్​ కాదు. అందుకే తాళం చెవులను దాచుకునే తాళాన్ని కొంటే సరిపోతుంది. మార్కెట్​లో చాలా కంపెనీలు ఇలాంటి కీ లాకర్స్ తెచ్చాయి. ఫీచర్లను బట్టి ధర ఉంటుంది. టెక్​జెరె కంపెనీ లాకర్​ని నాలుగు అంకెల కాంబినేషన్ కీతో లాక్​ చేయాలి. దీన్ని ఇంట్లో ఒక మూలకు ఇన్​స్టాల్​ చేసుకుంటే సరిపోతుంది. బయటికి వెళ్లేటప్పుడు తాళాలన్నీ అందులో పెట్టి లాక్​ చేసుకోవచ్చు. ఎన్ని సార్లు కావాలంటే అన్ని సార్లు నెంబర్​ కాంబినేషన్​ని రీసెట్​ చేసుకోవచ్చు. దీన్ని డై-కాస్ట్ జింక్​తో తయారుచేశారు. చాలా స్ట్రాంగ్​గా ఉంటుంది. ధర: 995 రూపాయలు