టూల్స్ గాడ్జెట్స్..ఫోన్ హ్యాండిల్

టూల్స్ గాడ్జెట్స్..ఫోన్ హ్యాండిల్

ఫోన్ హ్యాండిల్

చాలామంది వ్లాగర్లు ఇదివరకు ఎక్కువగా కెమెరాలను వాడేవాళ్లు. కానీ.. కొన్నాళ్ల నుంచి ఎక్కువగా ఫోన్‌‌తోనే వీడియోలు రికార్డ్​ చేస్తున్నారు. ముఖ్యంగా ఐ–ఫోన్‌‌లతోనే వ్లాగ్స్ తీస్తున్నారు. ఇలా చేయడం వల్ల ప్రత్యేకంగా కెమెరా సెటప్ క్యారీ చేయాల్సిన అవసరం ఉండదు. అయితే.. కెమెరా హ్యాండిల్‌‌ను పట్టుకోవడానికి అలవాటు పడ్డవాళ్లు సన్నగా ఉండే ఫోన్‌‌తో వ్లాగ్స్‌‌ చేయాలంటే కాస్త ఇబ్బందే. కానీ.. ఆ ఇబ్బంది ఉండకూడదు అంటే... ఈ ఫోన్ హ్యాండిల్‌‌ని పట్టుకుంటే సరిపోతుంది. ఇది హ్యాండిల్‌‌ మాత్రమే కాదు. కెమెరా షట్టర్‌‌‌‌లా కూడా పనిచేస్తుంది. ఉలాన్జి అనే కంపెనీ ఈ హ్యాండిల్‌‌ని మార్కెట్‌‌లోకి తెచ్చింది. ఈ హ్యాండిల్ పైభాగంలో రిమోట్‌‌ కంట్రోల్‌‌ ఉంటుంది. అవసరమైతే దీన్ని విడదీసి బ్లూటూత్ కెమెరా షట్టర్‌‌‌‌లా కూడా వాడుకోవచ్చు. ఇది 15 మీటర్ల దూరం వరకు పనిచేస్తుంది. ఈ హ్యాండిల్‌‌కు ఒక ఫిమేల్‌‌ థ్రెడ్‌‌ ఉంటుంది. దాని ద్వారా మైక్రోఫోన్‌‌ కూడా కనెక్ట్‌‌ చేసుకోవచ్చు. మౌంట్‌‌కి బిగించుకోవచ్చు. వ్లాగ్ షూటింగ్, లైవ్ స్ట్రీమింగ్, సెల్ఫీలు, గ్రూప్ ఫొటోలు తీయడానికి కంఫర్ట్‌‌గా ఉంటుంది. ఇది ఎర్గోనామిక్ ఫోన్ ఫొటోగ్రిప్‌‌తో వస్తుంది. ఫోన్‌‌ని డెస్క్‌‌టాప్‌‌ మీద నిటారుగా పెట్టుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. ట్రైపాడ్‌‌కి కూడా బిగించుకోవచ్చు. దీనికి ఉండే ఫ్లాష్‌‌ లైట్‌‌తో నైట్ టైంలో కూడా క్వాలిటీ వీడియోలు రికార్డ్ చేయొచ్చు. 

ధర: 2,790 రూపాయలు

స్టయిలస్ పెన్ 

శ్యామ్‌‌సంగ్‌‌లో కొన్ని ఫ్లాగ్‌‌షిప్ మొబైల్స్‌‌, ఐప్యాడ్స్‌‌కి మాత్రమే స్టైలస్‌‌ వస్తుంది. మరి మిగతా ఫోన్లు, ట్యాబ్లెట్లకు వాడుకోవాలంటే ఎలా? అందుకే అమెజాన్ బేసిక్స్‌‌ నుంచి ఒక కెపాసిటివ్‌‌ స్టయిలస్‌‌ను మార్కెట్‌‌లోకి తెచ్చింది. అయితే.. ఫ్లాగ్‌‌షిప్‌‌ డివైజ్‌‌లలో ఉన్నట్టు స్టయిలస్‌‌ కోసం స్పెషల్‌‌ ఫీచర్లు లేకపోయినా.. ఈ స్టయిలస్‌‌తో కూడా ఫోన్‌‌, ట్యాబ్లెట్‌‌లో బొమ్మలు గీయడం, బ్రౌజింగ్ చేయడం లాంటివి చేయొచ్చు. ముఖ్యంగా డిజిటల్ రీడర్లకు ఈ స్టయిలస్ బాగా ఉపయోగపడుతుంది. స్క్రోలింగ్ చేసేటప్పుడు యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. దీనికి 7mm ట్రాన్స్‌‌పరెంట్‌‌ డిస్క్‌‌ ఉంటుంది. దీన్ని అల్యూమినియంతో తయారు చేయడం వల్ల బరువు తక్కువగా ఉంటుంది.

ధర : 249 రూపాయలు

బ్లూటూత్​ ట్రాన్స్‌‌మీటర్‌‌‌‌

ఇప్పటికీ చాలామంది ఇండ్లలో పాత తరం టీవీలనే వాడుతున్నారు. అలాంటి టీవీల్లో బ్లూటూత్‌‌ ఆప్షన్‌‌ ఉండదు. అలాంటప్పుడు ఏదైనా వీడియో సాంగ్ వచ్చినప్పుడు బ్లూటూత్ హెడ్‌‌సెట్‌‌లో వినాలంటే కుదరదు. అందుకే పోర్టోనిక్స్‌‌ కంపెనీ టూ ఇన్‌‌ వన్‌‌ బ్లూటూత్‌‌ ట్రాన్స్‌‌మీటర్‌‌‌‌, రిసీవర్‌‌‌‌ని మార్కెట్‌‌లోకి తెచ్చింది. పాత టీవీలకు ఉండే  AUX ఫిమేల్‌‌ పోర్ట్‌‌ నుంచి ఈ ట్రాన్స్‌‌మీటర్‌‌‌‌కు ఉండే ఫిమేల్‌‌ పోర్ట్‌‌కి కేబుల్‌‌తో కనెక్ట్‌‌ చేస్తే చాలు. టీవీ సౌండ్‌‌ ట్రాన్స్‌‌మీటర్‌‌‌‌‌‌కు కనెక్ట్‌‌ చేసిన బ్లూటూత్‌‌ డివైజ్‌‌లో కూడా వినిపిస్తుంది. అంతేకాదు.. దీనికి ఉండే బటన్‌‌ నొక్కి మోడ్‌‌ షిఫ్ట్ చేస్తే.. ఇది బ్లూటూత్‌‌ రిసీవర్‌‌‌‌లా పనిచేస్తుంది. మామూలు 3.5 ఎంఎం ఇయర్‌‌‌‌ఫోన్స్‌‌ని కూడా బ్లూటూత్‌‌ ఇయర్‌‌‌‌ఫోన్స్‌‌లా వాడుకోవచ్చు. ఎలాగంటే.. ఈ డివైజ్‌‌ని ముందుగా ఫోన్‌‌, లేదా టీవీకి బ్లూటూత్‌‌ ద్వారా కనెక్ట్‌‌ చేయాలి. తర్వాత ఈ డివైజ్‌‌కు ఉండే 3.5 ఎం.ఎం. జాక్‌‌ ద్వారా ఇయర్‌‌‌‌ఫోన్స్‌‌ని కనెక్ట్‌‌ చేసుకోవాలి. ఫోన్‌‌లో ప్లే చేసే సౌండ్‌‌ ఇయర్‌‌‌‌ఫోన్స్‌‌లో వినిపిస్తుంది. ఈ డివైజ్‌‌ని ఒక్కసారి ఫుల్‌‌ ఛార్జ్‌‌ చేస్తే 10 గంటల పాటు పనిచేస్తుంది. ఇందులో 450 MAH ఇన్‌‌బిల్ట్‌‌ బ్యాటరీ ఉంటుంది. ఇది ఫుల్‌‌ ఛార్జ్ కావడానికి రెండు గంటలు పడుతుంది. 

ధర : 899 రూపాయలు 

రీల్స్‌ స్క్రోల్‌ 

ఇప్పుడంతా రీల్స్‌‌  హవా నడుస్తోంది. యూత్‌‌ నుంచి పెద్దవాళ్ల వరకు దాదాపు అందరూ రీల్స్, షార్ట్‌‌ వీడియోలు చూస్తున్నారు. కానీ.. వీడియోలు చూసినట్టు ఫోన్‌‌ని ఒక చోట పెట్టి రీల్స్ చూడడం కుదరదు. ఒక రీల్‌‌ చూడడం పూర్తయిన వెంటనే స్క్రోల్‌‌ చేస్తేనే మరో రీల్‌‌ వస్తుంది. ఫోన్ దూరంగా ఉన్నా రీల్స్‌‌ స్క్రోల్‌‌ చేసి చూడొచ్చు ఈ గాడ్జెట్‌‌తో. ఈ బ్లూటూత్‌‌ రిమోట్ కంట్రోల్‌‌ గాడ్జెట్‌‌ని చాలా కంపెనీలు మార్కెట్‌‌లోకి తెచ్చాయి. దీన్ని బ్లూటూత్‌‌తో ఫోన్‌‌కి కనెక్ట్‌‌చేయాలి. చాలా చిన్న సైజులో ఉంటుంది. దీంతో రీల్స్‌‌ని స్క్రోల్‌‌ చేయడమే కాకుండా కాదు కెమెరా షట్టర్‌‌‌‌లా, నచ్చిన రీల్‌‌ని లైక్‌‌ చేయడానికి కూడా వాడొచ్చు. 

ధర : 799 రూపాయలు