బాల కార్మికులను పనిలో పెట్టుకుంటే కఠిన  చర్యలు : తూప్రాన్ ఆర్డివో జయచంద్ర రెడ్డి 

బాల కార్మికులను పనిలో పెట్టుకుంటే కఠిన  చర్యలు :  తూప్రాన్ ఆర్డివో జయచంద్ర రెడ్డి 
  •     తూప్రాన్ ఆర్డివో జయచంద్ర రెడ్డి 

తూప్రాన్,వెలుగు : బాలకార్మికులను ఎవరైనా పనిలో పెట్టుకుంటే వారి పై  కఠిన చర్యలు తీసుకుంటామని తూప్రాన్ ఆర్డీఓ జయచంద్ర రెడ్డి హెచ్చరించారు.  తూప్రాన్ డివిజన్ కార్యాలయం లో  మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, గ్రామ పాలన ఆఫీసర్ లతో సమావేశం నిర్వహించారు. డివిజన్  పరిధిలోని పరిశ్రమలలో, వర్క్​షాపుల్లో  , ఇతర సంస్థల్లో బాల కార్మికులు పనిచేస్తున్నారా అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. బాల కార్మికులను నివారించేందుకు  ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతగా తీసుకుందన్నారు.

అధికారులు తమ పరిధిలోని పరిశ్రమలను నిరంతరం పర్యవేక్షిస్తూ, బాల కార్మికులు పనిలో పెట్టుకున్న కంపెనీ లపై  తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. యజమానులు కార్మిక చట్టాల అమలులో నిర్లక్ష్యం వహిస్తే  కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ‘ఆపరేషన్ స్మైల్’కా ర్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేసి బాలల హక్కులను రక్షించాలన్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బర్త్, రెసిడెన్స్, ఇన్కమ్ సర్టిఫికెట్లపై  ప్రత్యేక దృష్టి పెట్టాలని జీపీఓలకు సూచించారు.ఈ కార్యక్రమం  లో డివిజన్ పరిధిలోని ఆర్ ఐ లు జి పి వో లు  ఉన్నారు.