తూప్రాన్, వెలుగు: మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణంలోని గీతా స్కూల్, శ్రీ చైతన్య స్కూల్స్ టెన్త్ రిజల్ట్స్ సత్తాచాటాయి. గీతా స్కూల్ కు చెందిన సాయిచరణ్ రెడ్డి 575 మార్కులు, పి.రాజేశ్ 574, టి. శ్రీజ 574, వి.భవ్య 571, జి. సుధామహి 571, ఎ. చరణ్ 571, వరుణ్ 569, కె.విఘ్నేశ్ 568, జి. స్ఫూర్తి 568 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో సత్తా చాటారు. శ్రీ చైతన్యకు చెందిన ఎం.అద్వైత 588 మార్కులు, వి.రుషిక్ 585 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబరిచారు.
ర్యాంకులు సాధించిన స్టూడెంట్లను గీత స్కూల్ కరస్పాండెంట్ రామాంజనేయులు, చైర్పర్సన్ ఉషా, శ్రీచైతన్య స్కూల్ స్టూడెంట్లను ఏజీఎం రమణారావు, ప్రిన్సిపాల్ రామకృష్ణ అభినందించారు. మండలంలో 944 మంది ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్స్ విద్యార్థులు పరీక్షలు రాయగా, 918 మంది పాస్ అయినట్లు ఎంఈవో సత్యనారాయణ తెలిపారు.

