భారత స్టాక్ మార్కెట్లు వరుసగా మూడు రోజుల నుంచి నష్టాల్లోనే ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి. తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి 10 శాతం టారిఫ్స్ ప్రకటించవచ్చనే వార్తలతో దేశీయ ఫార్మా స్టాక్స్ నష్టాల్లో కొనసాగుతున్నాయి. దీనికి తోడు వరుసగా బ్యాంకింగ్ స్టాక్స్ కూడా బేజారటం ఇన్వెస్టర్ల సెంటిమెంట్లను దెబ్బతీస్తోంది. ఉదయం 10.52 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 10:52 656 పాయింట్ల నష్టంలో, నిఫ్టీ 179 పాయింట్ల నష్టంతో, నిఫ్టీ బ్యాంక్ 605 పాయింట్ల నష్టంతో, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 470 పాయింట్ల నష్టంతో ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి.
స్టాక్ మార్కెట్ పతనానికి ప్రధాన కారణాలు..
1. ముడి చమురు ధరల పెరుగుదల:
బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 92.06 డాలర్లకు చేరింది. పశ్చిమ ఆసియా ఉద్రిక్తతలతో చమురు సరఫరాపై ఆందోళనలు పెరగడం వల్ల ధరలు ఎగిశాయి. ఇది భారత్‌లో ద్రవ్యోల్బణం, వాణిజ్య లోటుపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
2. రూపాయి బలహీనత:
ముడి చమురు ధరల పెరుగుదల, భౌగోళిక ఉద్రిక్తతల కారణంగా డాలర్‌కు డిమాండ్ పెరిగింది. దీంతో రూపాయి 11 పైసలు క్షీణించి డాలర్‌కు 96.36 వద్ద ట్రేడైంది.
3. పశ్చిమ ఆసియా ఉద్రిక్తతలు:
రెడ్ సీ, హోర్ముజ్ జలసంధిలో చమురు ట్యాంకర్లపై దాడులు, హౌతి తిరుగుబాటుదారుల హెచ్చరికలు మార్కెట్‌లో అనిశ్చితిని పెంచాయి. దీంతో పెట్టుబడిదారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.
4. ట్రంప్ టారిఫ్‌ల ప్రభావం:
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జనరిక్ మందుల దిగుమతులపై దశలవారీ సుంకాలు ప్రకటించడంతో ఫార్మా షేర్లు భారీగా పడిపోయాయి. సన్ ఫార్మా, సిప్లా, డాక్టర్ రెడ్డీస్ వంటి షేర్లు నష్టాల్లో ట్రేడయ్యాయి.
ALSO READ : దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన గోల్డ్.. ఒక్కరోజే తులం రూ.2వేల 300 పెరిగింది..
5. ఇండియా VIX పెరుగుదల:
మార్కెట్ భయ సూచిక ఇండియా VIX దాదాపు 3 శాతం పెరిగి 13 స్థాయికి చేరింది. ఇది మార్కెట్‌లో అనిశ్చితి పెరిగిందని, పెట్టుబడిదారులు రిస్క్ తగ్గిస్తున్నారని సూచిస్తోంది.
6. బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి:
బంధన్ బ్యాంక్ లాభాలు పెరిగినా భవిష్యత్ మార్గదర్శకాలు బలహీనంగా ఉండటంతో షేర్ 10 శాతం పడిపోయింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కూడా బలహీన నెట్ ఇంటరెస్ట్ మార్జిన్ కారణంగా క్షీణించింది. దీంతో నిఫ్టీ బ్యాంక్ సూచీ 1 శాతానికి పైగా నష్టపోయింది.
