మహారాష్ట్రలో 3 ప్లాంట్లు... రూ.18 వేల కోట్లతో నిర్మించనున్న టయోటా మోటార్స్

మహారాష్ట్రలో 3 ప్లాంట్లు... రూ.18 వేల కోట్లతో నిర్మించనున్న టయోటా మోటార్స్

న్యూఢిల్లీ: ఆటోమొబైల్​ కంపెనీ  టయోటా మోటార్‌‌  మహారాష్ట్రలో మూడు కొత్త వెహికల్‌‌ అసెంబ్లింగ్‌‌ ప్లాంట్లను నిర్మించాలని చూస్తోంది.  జపాన్‌‌కు చెందిన నిక్కీ న్యూస్‌‌పేపర్‌‌‌‌ ప్రకారం,   ఈ ప్లాంట్లు 2030 నాటికి అందుబాటులోకి రానున్నాయి. దీంతో టయోటా ఉత్పత్తి సామర్ధ్యం ఇండియాలో  10 లక్షల యూనిట్లకు చేరనుంది. 

మొత్తం పెట్టుబడి అంచనా 300 బిలియన్‌‌ యెన్‌‌ (దాదాపు రూ.18 వేల కోట్లు). ప్లాంట్ల ఏర్పాటుపై  తుది నిర్ణయం తీసుకోలేదని, ఇంకా  పరిశీలిస్తున్నామని టయోటా ఓ స్టేట్‌‌మెంట్‌‌లో పేర్కొంది.