
కాళేశ్వరం తెలంగాణ సీఎం కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంలా మారిందని తాము ముందునుంచి చెప్తూనే ఉన్నామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు . నాణ్యతా లోపం వల్లే మేడిగడ్డ బ్యారేజీ వంతెన కుంగిందని ఆయన అన్నారు. ఢిల్లీలో మీడియాతో రేవంత్ మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచానికే అద్భుతమని బీఆర్ఎస్ చేప్తూ వచ్చిందని ఇప్పుడు అసలు డొల్లతనం, నిజస్వరూపం ఇప్పుడు బయటపడిందన్నారు.
దీనిపై ఇప్పటికైనా కేంద్రం విచారణ జరిపించాలని రేవంత్ డిమాండ్ చేశారు. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్‌తో దర్యాప్తు చేయించాలని, కాళేశ్వరం పనులపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలన్నారు. ఇప్పుడు వరదలు లేకుండానే ప్రాజెక్టు కుంగిపోయిందన్నారు రేవంత్.. కాళేశ్వరంలో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందని రాహుల్‌గాంధీ చెప్పారని, దీనిపై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరంలో అవినీతిని కాంగ్రెస్ పార్టీ బయటపెడుతుందని రేవంత్ తెలిపారు.
Also Read : బీఆర్ఎస్,బీజేపీ, కాంగ్రెస్.. నియోజకవర్గాల్లో తలపడేది వీళ్లే..
కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజీ పిల్లర్లు శనివారం సాయంత్రం కుంగిపోయాయి. 6వ బ్లాక్‌లో 15 నుంచి 20 మధ్య ఉన్న పిల్లర్లలో కొన్ని కుంగినట్లు తెలుస్తోంది. దీంతో ప్రాజెక్టు బ్రిడ్జి షేప్ మారినట్టు కనిపిస్తోంది. మెయింటెనెన్స్ వర్క్ చేస్తున్న సిబ్బంది.. గేట్ల నుంచి శబ్దాలు రావడంతో అలర్ట్ అయ్యారు.
పిల్లర్లు కుంగినట్టు గుర్తించి వెంటనే మహారాష్ట్ర, తెలంగాణ మధ్య రాకపోకలు బంద్ చేశారు. దీంతో రెండువైపులా పెద్దసంఖ్యలో వాహనాలు బారులుతీరాయి.