రాష్ట్రంలో ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారని ఆరోపించారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. అనుమతి కోసం డీజీపీకి రాసిన లేఖలో కోవిడ్ నిబంధనలకు పాటిస్తూనే కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పామన్నారు ఉత్తమ్. రాష్ట్రంలో కొందరు పోలీసు అధికారులు ….అధికార పార్టీకి మద్దతుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తన రాజకీయ జీవితంలో ఇలాంటి దుర్మార్గ పాలన ఎన్నడూ చూడలేదన్నారు ఉత్తమ్.
మంత్రుల పర్యటనల్లో ఎక్కడా నిబంధనలు పాటించట్లేదన్న ఉత్తమ్ …వారికి రూల్స్ వర్తించవా అని ప్రశ్నించారు. కేటీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డిలు కూడా అనేక కార్యక్రమాలు వందల మందితో నిర్వహిస్తున్నారన్న ఉత్తమ్.. వారు ఎక్కడ కోవిడ్ నిబంధనలు పాటించలేదన్నారు. టీఆర్ఎస్ లీడర్లపై పోలీసులకు ఎటువంటి అభ్యంతరం లేదని..దీనిపై గవర్నర్ కి, కోర్టు ను ఆశ్రయిస్తామని తెలిపారు ఉత్తమ్. డెమోక్రటిక్ పద్ధతిలో పోరాటం కొనసాగిస్తామన్నారు.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
10 రోజుల్లో 82 మరణాలు..తెలంగాణలో పెరుగుతున్నకరోనా
సీఎం కేసీఆర్‌పై అసభ్యకర పోస్టింగ్స్ చేసిన వ్యక్తి అరెస్టు

