కాంగ్రెస్ పార్టీతో పొత్తు ఖాయం : స్వయంగా ప్రకటించిన విజయ్

కాంగ్రెస్ పార్టీతో పొత్తు ఖాయం : స్వయంగా ప్రకటించిన విజయ్

విజయ్ టీవీకే పార్టీ పొత్తులు ఖరారు అవుతున్నాయి. టీవీకే పార్టీకి మద్దతు ఇస్తున్నాం అంటూ రాహుల్ గాంధీ ఇచ్చిన లేఖతో.. తమిళనాడు కాంగ్రెస్ నేతలు, ఎమ్మెల్యేలు టీవీకే పార్టీ ప్రధాన కార్యాలయానికి వచ్చారు. కాంగ్రెస్ నేతలను స్వయంగా ఆహ్వానించారు విజయ్. 

ఈ సందర్భంగా టీవీకే పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ తన లేఖను స్వయంగా విజయ్ కు అందజేశారు. ఆ లేఖను స్వయంగా అందుకున్న విజయ్.. కాంగ్రెస్ పార్టీకి థ్యాంక్స్ చెప్పారు. 

ప్రభుత్వ ఏర్పాటుకు టీవీకే పార్టీకి 118 ఎమ్మెల్యేల మద్దతు అవసరం. టీవీకే పార్టీకి సొంతంగా 108 సీట్లు ఉన్నాయి. మిగతా 10 సీట్లను ఇతర పార్టీల నుంచి మద్దతు తీసుకుంటున్నారు విజయ్. అందులో భాగంగా ఐదుగురు  ఎమ్మెల్యేలు ఉన్న కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చింది. మద్దతు విషయంపై రాహుల్ గాంధీ, విజయ్ ఫోన్ లో స్వయంగా మాట్లాడుకున్నారు. ఆ తర్వాత తమిళనాడు కాంగ్రెస్ శాఖ సైతం విజయ్ పార్టీకి మద్దతు ఇవ్వాలనే డిమాండ్ వినిపించింది. ఈ క్రమంలోనే రాహుల్ గాంధీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 

ALSO READ : తండ్రికి దూరంగా జేసన్ సంజయ్..

కాంగ్రెస్ మద్దతు లేఖను టీవీకే పార్టీ ఆఫీసులో.. ఆ పార్టీ అధినేత విజయ్ కు స్వయంగా అందజేయటంతో ఓ పొత్తు ఖరారు అయ్యింది. మిగతా ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు ఎవరు అనేది ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. 
సీపీఎం, సీపీఐ, డీఎండీకే, ముస్లిం లీగ్ పార్టీలు మద్దతు ఇస్తామని ఇప్పటికే ప్రకటించారు. ఆయా పార్టీల నుంచి అధికారికంగా లేఖలు అందాల్సి ఉంది.