కామారెడ్డి జిల్లా చిన్న మల్లారెడ్డి గ్రామంలో దారుణం జరిగింది. ట్రాక్టర్ ను దొంగలించడానికి యత్నించిన ఓ వ్యక్తిని దారుణంగా కొట్టారు గ్రామస్తులు. తీవ్ర గాయాలు అయిన రాకేష్ ష్ ను హాస్పీటల్ తరలిస్తుండగా మార్గమధ్యంలోనే చనిపోయాడు. సోమరం గ్రామానికి చెందిన రాకేష్ ష్ మద్యం తాగి ట్రాక్టర్ ఉన్న చోటుకు వెళ్లాడు. ట్రాక్టర్ పైకి ఎక్కి ఆన్ చేసే ప్రయత్నం చేస్తుండగా స్థానికులు గమనించి రాకే ష్ ను పట్టుకొని చిత్తకొట్టారు. దీంతో అతనికి తీవ్ర గాయాలు అయ్యాయి. బాధితుని జిల్లా ఏరియా హస్పీటల్ కు తరలిస్తుండగా చనిపోయాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
