మోడీ బహిరంగ సభ.. హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు

మోడీ బహిరంగ సభ.. హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు

ప్రధాని మోదీ నవంబర్ 7న తెలంగాణకు వస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా .... హైదరాబాద్  LB స్టేడియంలో బీజేపీ... బీసీ గర్జన సభలో ఆయన పాల్గొనన్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో సాయంత్రం ఐదున్నర గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా ఎల్బీ స్టేడియంలో జరిగే సభలో పాల్గొంటారు. మోదీ ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ సభలో మోదీ కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉందన్నారు బీజేపీ నేతలు. రాష్ట్ర బీజేపీ నాయకత్వం కూడా మోదీ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. లక్ష మందిని సభకు తరలించేలా ప్లాన్ చేస్తున్నారు.  

 హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు

  • ఇక మోదీ రాకతో సిటిలో ట్రాఫిక్ ఆంక్షలు పెట్టారు పోలీసులు. మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని చెప్పారు. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ట్రాఫిక్ డైవర్షన్స్ ఉంటాయని అధికారులు తెలిపారు. 
  • AR పెట్రోల్ బంక్ జంక్షన్ నుంచి BJR విగ్రహం వైపు ట్రాఫిక్ అనుమతించమన్నారు. ఇటు వైపే వచ్చే వాహనాలను నాంపల్లి లేదా రవీంధ్ర భారతి వైపు మళ్లించనున్నారు. 
  • అబిడ్స్, గన్ ఫౌండ్రీ వైపు నుంచి వచ్చే ట్రాఫిక్ BJR విగ్రహం వైపు వెళ్లకుండా మరో రూట్ కు డైవర్ట్ చేయనున్నారు.  SBI గన్ ఫౌండ్రీ వైపు నుంచి చాపెల్ రోడ్డు వైపు మళ్లిస్తారు. 
  • ఇటు ట్యాంక్ బండ్ నుంచి బషీర్ బాగ్ జంక్షన్ వైపు వచ్చే ట్రాఫిక్ లిబర్టీ జంక్షన్ వద్ద మళ్లిస్తారు. హిమాయత్ నగర్ వైపు టైమింగ్ ను బట్టి మళ్లిస్తామన్నారు ట్రాఫిక్ పోలీసులు