హైదరాబాద్ సిటీలోని ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ డైవర్షన్స్

హైదరాబాద్ సిటీలోని ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ డైవర్షన్స్

హైదరాబాద్ లో ట్రాఫిక్ జాం అంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రధాన రోడ్లపై ఏవైన మరమ్మత్తు పనులు జరిగితే.. ఆయా ప్రాంతాల్లో మరింత ఎక్కువగా ట్రాఫిక్ ఉంటుంది. ఈ నేపథ్యంలో అడిక్‌మెట్ వంతెన మరమ్మతు పనులు జరుగుతున్న క్రమంలో 30 రోజుల పాటు ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు.

హైదరాబాద్‌ అడిక్‌మెట్‌ వంతెన నల్లకుంట మరమ్మతుల నిమిత్తం ఈరోజు(అక్టోబర్ 12 నుంచి నవంబర్‌ 11వ తేదీ వరకు) 30 రోజుల పాటు మూసివేస్తున్నామని చెప్పారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు ట్రాఫిక్‌ మళ్లింపులను ప్రకటించారు. దీన్ని వాహనదారులు గమనించి గమ్యస్థానానికి చేరుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలను ఎంపిక చేసుకోవాలని తెలిపారు. 

ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల మధ్య విద్యానగర్‌ వై జంక్షన్‌ మీదుగా వచ్చే ఆర్టీసీ బస్సులు సహా భారీ వాహనాలు తార్నాక, హబ్సిగూడ, సికింద్రాబాద్‌, లాలాపేట్‌, ఈసీఐఎల్‌, నాచారం, మౌలాలి, విద్యానగర్‌ వై జంక్షన్‌ వైపు మళ్లిస్తారు. ఈ క్రమంలో NCC ఉస్మానియా యూనివర్సిటీ రోడ్‌లోకి అంటే అడిక్‌మెట్ ఫ్లైఓవర్/ROBపైకి వాహనాలు అనుమతించబడవు.

అటు విద్యానగర్ ‘వై’ జంక్షన్ మీదుగా వచ్చే అన్ని ఎల్‌ఎంవీలు, తార్నాక లేదా చిలకలగూడ లేదా సికింద్రాబాద్ వైపు వెళ్లాలనుకునే అన్ని ఎల్‌ఎంవీలు రాంనగర్ టి జంక్షన్ వద్ద రాంనగర్ గుండు వైపు మళ్లిస్తామని పేర్కొన్నారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల మధ్య విద్యానగర్‌ ‘వై’ జంక్షన్‌- రామ్‌నగర్‌ టి జంక్షన్‌ నుంచి రాంనగర్‌ గుండు వైపు వచ్చే భారీ వాహనాలను రాంనగర్‌ గుండు నుంచి రాంనగర్‌ ఎక్స్‌ రోడ్డు వైపు దారి మళ్లిస్తామని తెలిపారు. భారీ వాహనాలను ఓయూ రోడ్డు లేదా లలిత నగర్ రోడ్డులోకి అనుమతించమని వెల్లడించారు.

ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల మధ్య తార్నాక జంక్షన్‌ మీదుగా వచ్చే ఆర్టీసీ బస్సులతో సహా భారీ వాహనాలు విద్యానగర్‌ – హిందీ మహావిద్యాలయం – శంకర్‌ మట్‌ – ఫీవర్‌ హాస్పిటల్‌ రోడ్డు వైపు వెళ్లాలంటే ఓయూ ‘వై’ జంక్షన్‌ వద్ద ఉస్మానియా యూనివర్శిటీ రోడ్డు – ఎన్‌సీసీ మీదుగా వెళ్లాలి. విద్యానగర్ రోడ్డు అంటే అడిక్‌మెట్ ఫ్లైఓవర్/ROBపైకి అనుమతి లేదని తెలిపారు.

విద్యానగర్ – హిందీ మహావిద్యాలయం – శంకర్ మట్ – ఫీవర్ హాస్పిటల్ రోడ్డు వైపు వెళ్లేవి తార్నాక జంక్షన్ మీదుగా వచ్చే అన్ని ఎల్‌ఎమ్‌విలు రెండు, మూడు, నాలుగు చక్రాల వాహనాలు ప్రొఫెసర్ రామి రెడ్డి దూర విద్యా కేంద్రం వద్ద బౌద్ధనగర్ ఎక్స్ రోడ్ వైపు మళ్లించబడతాయని వివరించారు. 

రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల మధ్య తార్నాక జంక్షన్‌ నుంచి వచ్చే భారీ వాహనాలను సీతఫల్‌మండి టి జంక్షన్‌ వద్ద ఆర్‌ఓబి సీతాఫల్‌మండి వైపు మళ్లిస్తారు. భారీ వాహనాలను వారాసిగూడ రోడ్డు వైపు అనుమతించరు. సీతఫల్మండి జంక్షన్ వద్ద చిలకలగూడ రోడ్డు వైపు మళ్లిస్తామని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.