హైదరాబాద్ పబ్లిక్ కు అలర్ట్: ఈ ఏరియాలో 45 రోజులు ట్రాఫిక్ ఆంక్షలు...

హైదరాబాద్ పబ్లిక్ కు అలర్ట్: ఈ ఏరియాలో 45 రోజులు ట్రాఫిక్ ఆంక్షలు...

హైదరాబాద్ సిటీ, వెలుగు: గోషామహల్ లోని దారుసలాం ప్రాంతంలో చేపట్టనున్న డ్రైనేజీ నిర్మాణ పనుల కారణంగా 45 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ పోలీస్ కమిషనర్ డి జోయల్ డేవిస్ తెలిపారు. దారుసలాంలోని ఎస్బీఐ నుంచి చాకన్​వాడీ కల్వర్టు వరకు  బాక్స్ డ్రెయిన్ పనులు బుధవారం ప్రారంభమయ్యాయి. ఈ ప్రాంతం మీదుగా ప్రయాణించే వాహనదారులకు ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ మళ్లింపులు విధించినట్టు చెప్పారు. 

మల్లేపల్లి, బోయిగూడ కమాన్, ఆఘాపురా నుంచి అలస్కా టీ జంక్షన్ వైపు రూట్ లో వచ్చే వాహనాలను దారుసలాం వద్ద ఏక్-మినార్ మసీదు వైపు,  అలాగే, అలాస్కా జంక్షన్ నుంచి దారుసలాం వైపు రూట్​లో వెళ్లే వాహనాలను కలకత్తా స్వీట్ హౌస్ వద్ద చాకన్​వాడీ ఇంటర్నల్​రోడ్ల మీదుగా మళ్లించినట్లు చెప్పారు. 

తాజా ట్రాఫిక్ అప్‌‌‌‌‌‌‌‌డేట్ల కోసం హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ అధికారిక సోషల్ మీడియా అకౌంట్లను ఫాలో కావాలన్నారు. ఏదైనా అత్యవసమైతే 9010203626 నంబర్​కు కాల్​చేయవచ్చన్నారు.