గద్దకు ప్రాణం

 గద్దకు ప్రాణం

బేగంపేట ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ ప్రాంగణం వద్ద చైనా మాంజాలో చిక్కుకొని విలవిలలాడుతున్న గద్దను ట్రాఫిక్ పోలీసులు రక్షించారు. శనివారం అటుగా వెళ్తున్న ఏడీసీపీ (ట్రాఫిక్-1) లక్ష్మి, సహాయ పోలీస్ కమిషనర్ జి. శంకర్ రాజు గద్దను గుర్తించి, సిబ్బందితో కలిసి కర్ర సాయంతో జాగ్రత్తగా కిందకు దించారు. కాళ్లకు చిక్కిన మాంజాను తొలగించి అవసరమైన చికిత్స అందించారు. - వెలుగు, పద్మారావునగర్