హైదరాబాదీలకు అలర్ట్.. ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్ చుట్టూ ఇవాళ (సెప్టెంబర్ 27) ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాదీలకు అలర్ట్.. ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్ చుట్టూ ఇవాళ (సెప్టెంబర్ 27) ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్​ సిటీ, వెలుగు: అప్పర్ ట్యాంక్ బండ్‌‌‌‌లో శనివారం బతుకమ్మ ప్రభుత్వం బతుకమ్మ సంబురాలు నిర్వహించనుంది. దీంతో అప్పర్ ట్యాంక్ బండ్ , నెక్లెస్ రోడ్ చుట్టూ మధ్యాహ్నం 2 నుంచి  రాత్రి 11 వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని ట్రాఫిక్​ జాయింట్​సీపీ శుక్రవారం ప్రకటించారు. తెలుగు తల్లి జంక్షన్ , కర్బలా మైదాన్ నుంచి ట్యాంక్‌‌‌‌బండ్ వైపు వచ్చే వెహికల్స్‎కు అనుమతి లేదు. ఇక్బాల్ మీనార్  నుంచి అప్పర్ ట్యాంక్ బండ్ వైపు వచ్చే ట్రాఫిక్  తెలుగు తల్లి ఫ్లైఓవర్– కట్ట మైసమ్మ – డీబీఆర్ – ఇందిరా పార్క్ – గాంధీనగర్ – ఆర్‌‌‌‌టీసీ క్రాస్ రోడ్ మీదుగా డైవర్ట్ అవుతుంది. 

వీవీ స్టాచ్యూ నుంచి ఎన్‌‌‌‌టీఆర్ మార్గ్ వైపు వచ్చే ట్రాఫిక్ ఇందిరా గాంధీ స్టాచ్యూ వద్ద ప్రసాద్స్ ఐ‌‌‌‌మాక్స్, మింట్ కాంపౌండ్ లేన్ వైపు వెళ్తుంది. నల్లగుట్ట జంక్షన్ నుంచి బుద్ధ భవన్ వైపు వెహికల్స్‎కు అనుమతి లేదు. నల్లగుట్ట ఎక్స్-క్రాస్ రోడ్ల వద్ద రాణిగంజ్, నెక్లెస్ రోడ్ వైపు డైవర్షన్​ఉంది. లిబర్టీ నుంచి అప్పర్ ట్యాంక్ బండ్ వైపు వచ్చే ట్రాఫిక్ అంబేడ్కర్ స్టాచ్యూ వద్ద ఇక్బాల్ మీనార్ నుంచి యూటర్న్ తీసుకొని తెలుగు తల్లి జంక్షన్ తెలుగు తల్లి ఫ్లైఓవర్‌‌‌‌పై డైవర్ట్ కావాలి. 

సికింద్రాబాద్ నుంచి అప్పర్ ట్యాంక్ బండ్ వైపు వచ్చే ట్రాఫిక్ కర్బలా మైదాన్ వద్ద బైబిల్ హౌస్– జబ్బార్ కాంప్లెక్స్ – కవాడిగూడ – గాంధీ నగర్ టీ జంక్షన్– గోశాల– ధోబీ ఘాట్– స్విమ్మింగ్ పూల్ – బండమైసమ్మ – ఇందిరా పార్క్ -కట్టమైసమ్మ, తెలుగుతల్లి ఫ్లైఓవర్ వైపు డైవర్ట్  అవుతాయి. ముషీరాబాద్, కవాడిగూడ నుంచి చిల్డ్రన్స్ పార్క్– అప్పర్ ట్యాంక్ బండ్ వైపు వచ్చే ట్రాఫిక్‎కు అనుమతి లేదు. డీబీఆర్ మిల్స్ వద్ద తహసీల్దార్​ఆఫీస్ – ధోబీఘాట్ – స్విమ్మింగ్ పూల్ – బండమైసమ్మ – ఇందిరా పార్క్ -కట్టమైసమ్మ వైపు వెళ్లాల్సి ఉంటుంది. 

ఆర్‌‌‌‌టీసీ బస్సుల డైవర్షన్..

సికింద్రాబాద్ నుంచి ఎంజీబీఎస్ వైపు వచ్చే అన్ని ఇంటర్ డిస్ట్రిక్ట్ ఆర్టీసీ బస్సులు  మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 11 వరకు  దారి మార్చుకోవాలి. అవి  స్వీకార్- ఉపకార్ జంక్షన్ వద్ద వైవైసీఏ– సంగీత్ – మెట్టుగూడ – తార్నాక – నల్లకంట – ఫీవర్ హాస్పిటల్ క్రాస్ రోడ్ – బర్కత్‌‌‌‌పూర – టూరిస్ట్ హోటల్ -నింబోలి అడ్డా – చాదర్‌‌‌‌ఘాట్ రంగ్‌‌‌‌మహల్ మీదుగా ఎంజీబీఎస్ వైపు వెళ్లాలి. సిటీ బస్సులు కర్బలా మైదాన్ వద్ద బైబిల్ హౌస్ – జబ్బార్ కాంప్లెక్స్ - కవాడిగూడ క్రాస్ రోడ్​ నుంచి గాంధీ నగర్ టీ జంక్షన్ – గోశాల – ధోబీఘాట్ – స్విమ్మింగ్ పూల్ – బందమైసమ్మ – ఇందిరా పార్క్ - కట్టమైసమ్మ , తెలుగు తల్లి ఫ్లైఓవర్ వైపు డైవర్ట్ అవుతాయి.

పార్కింగ్ ఏర్పాట్లు..

స్నో వరల్డ్, ఎన్‌‌‌‌టీఆర్ స్టేడియం, మార్టీర్స్ మెమోరియల్ పార్కింగ్ ప్లేస్, రేస్ కోర్స్ రోడ్, బీఆర్‌‌‌‌కే భవన్ రోడ్, హెచ్‌‌‌‌ఎండీఏ పార్కింగ్, సంజీవయ్య పార్క్, లుంబినీ పార్క్​లో పార్కింగ్​కు ఏర్పాట్లు చేశారు.