ఇయ్యాల సిటీలో ట్రాఫిక్ ఆంక్షలు

ఇయ్యాల సిటీలో ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: రాహుల్ గాంధీ చేపట్టిన  భారత్ జోడో యాత్ర సందర్భంగా సిటీలో మంగళవారం ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు యాత్ర జరిగే రూట్స్‌‌‌‌‌‌‌‌లో వెహికల్స్​ను దారి మళ్లిస్తున్నట్లు జాయింట్‌‌‌‌‌‌‌‌ సీపీ, ట్రాఫిక్ ఏవీ రంగనాథ్‌‌‌‌‌‌‌‌ సోమవారం ఓ ప్రకటనలో  వెల్లడించారు.

ఓల్డ్ ​సిటీలోని హుస్సేనీ ఆలం,చార్మినార్, మదీనా, అఫ్జల్‌‌‌‌‌‌‌‌గంజ్, ఎంజే మార్కెట్, గాంధీభవన్, నాంపల్లి, పబ్లిక్‌‌‌‌‌‌‌‌గార్డెన్, అసెంబ్లీ, రవీంద్రభారతి, ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ, ఇక్బాల్‌‌‌‌‌‌‌‌మినార్, తెలుగు తల్లి ఫ్లైఓవర్ , ఎన్టీఆర్ గార్డెన్, ఇందిరాగాంధీ విగ్రహం, ఐమ్యాక్స్ సర్కిల్, నెక్లెస్‌‌‌‌‌‌‌‌ రోడ్​ రూట్లలో వెహికల్ డైవర్షన్‌‌‌‌‌‌‌‌ ఉంటుందన్నారు. వాహనదారులు ఇతర  రూట్లలో వెళ్లాలని సూచించారు.