హైదరాబాద్ నగరంలోని పలు ఏరియాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు నగర ట్రాఫిక్ పోలీసులు. ఎస్‌డబ్ల్యూజీ సీవర్ లైన్‌ను ఏర్పాటు చేయనున్న తరుణంలో నెల రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్టు ప్రకటించారు. ఏప్రిల్ 5 నుంచి ట్రాఫిక్ ఆంక్షలు అమలులోకి వచ్చాయని పోలీసులు తెలిపారు. రాంకోట్ నుండి ఈడెన్ గార్డెన్ 'ఎక్స్' రహదారికి వచ్చే వాహనాల రాకపోకలను వన్-వేగా అనుమతిస్తారు.
కింగ్ కోటి 'ఎక్స్' రోడ్డు నుంచి రాంకోట్ 'ఎక్స్' రోడ్డు మీదుగా ఈడెన్ గార్డెన్స్ నుంచి వచ్చే ట్రాఫిక్‌ను స్మశానవాటిక, నారాయణగూడ వైపు మళ్లిస్తారు. అలాగే, నారాయణగూడ శ్మశానవాటిక రోటరీ నుంచి రాంకోట్ వైపు ఈడెన్ గార్డెన్ 'ఎక్స్' రోడ్డు మీదుగా రాకపోకలు కింగ్ కోటి 'ఎక్స్' రోడ్డు వైపు మళ్లిస్తారు. ట్రాఫిక్ ఆంక్షలు గమనించి నగర వాసులు ప్రయాణం సాఫీగా సాగించాలని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సూచించారు.